https://oktelugu.com/

Pawan Kalyan: నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అంటూ ప్రకాష్ రాజ్, హీరో కార్తీ పై పవన్ కళ్యాణ్ ఫైర్!

పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో సనాతన ధర్మం బోర్డు ని ఏర్పాటు చేయాలి అని ప్రతిపాదన చేసినప్పుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ 'నేరం చేసిన వారికి విచారణ జరిపి శిక్ష వేయండి, అంతే కానీ ఇలా నేషనల్ లెవెల్ లో ఎందుకు రచ్చ చేస్తున్నారు. మన ఇండియా లో ఇప్పటి వరకు ఉన్న మత గొడవలు చాలవా?, కొత్తగా ఇవెందుకు' అని అన్నాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : September 24, 2024 / 12:36 PM IST

    Pawan Kalyan(16)

    Follow us on

    Pawan Kalyan: తిరుపతి లడ్డు వివాదం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒక కుదుపు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తిరుపతి లడ్డులను తయారు చెయ్యడానికి జంతువుల కొవ్వు ఉన్న నెయ్యిని వాడారని, అందుకే నాణ్యత పూర్తిగా తగ్గిపోయిందని ఆయన కామెంట్స్ చేసాడు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా తీవ్ర స్థాయిలో విచారం ని వ్యక్తం చేస్తూ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష ని చేపట్టిన సంగతి తెలిసిందే. నేడు ఆయన విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో నటుడు ప్రకాష్ రాజ్, హీరో కార్తీ లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో సనాతన ధర్మం బోర్డు ని ఏర్పాటు చేయాలి అని ప్రతిపాదన చేసినప్పుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ‘నేరం చేసిన వారికి విచారణ జరిపి శిక్ష వేయండి, అంతే కానీ ఇలా నేషనల్ లెవెల్ లో ఎందుకు రచ్చ చేస్తున్నారు. మన ఇండియా లో ఇప్పటి వరకు ఉన్న మత గొడవలు చాలవా?, కొత్తగా ఇవెందుకు’ అని అన్నాడు.

    దీనికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తూ ‘తిరుపతి లడ్డు అపవిత్రం గురించి మాట్లాడుతుంటే ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏమిటి అసలు?, నేనేమైన వేరే మతాన్ని నిందించానా?, తప్పు జరిగినప్పుడు స్పందించకపోతే ఎలా?, పోరాడక పోతే ఎలా?, మన ఇంటి మీద ఎవరైనా దాడి చేస్తే చూస్తూ చేతులు కట్టుకొని ఊరుకుంటామా?, ప్రకాష్ రాజ్ గారు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది అది మీకు కూడా తెలుసు, కానీ మతాల ఐక్యత పేరిట ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి, ఒక హిందువుగా మా మనోభావాలు దెబ్బ తిన్నాయి, దీనిపై ప్రాడాల్సిన అవసరం ఉంది. మీరు పోరాడకపోయిన పర్వాలేదు కానీ, మా సెంటిమెంట్స్ మీద హాస్యాస్పద వ్యాఖ్యలు చేయకండి’ అంటూ మాట్లాడాడు పవన్ కళ్యాణ్.

    అలాగే హీరో కార్తీ మాటలను కూడా పవన్ కళ్యాణ్ తప్పు పట్టాడు. ఆయన హీరో గా నటించిన ‘సత్యం సుందరం’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నిన్న ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ లడ్డు గురించి ఒక మీమ్ ని కార్తీకి చూపించగా, ఆయన దానికి సరదాగా కౌంటర్లు ఇస్తూ ‘ లడ్డు ఇప్పుడు చాలా సున్నితమైన టాపిక్.. దాని గురించి మాట్లాడొద్దు’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనిపై నేడు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ‘నిన్న ఒక్క సినిమా ఫంక్షన్ లో కూడా చూసాను. లడ్డు ఒక్క సున్నితమైన అంశం అని. అలా మాట్లాడేందుకు ధైర్యం చేయకండి. లడ్డు సున్నితమైన అంశం కాదు, అది మా సెంటిమెంట్, మాట్లాడే ముందు ఒకటికి 100 సార్లు ఆలోచించండి’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సోషల్ మీడియా లో దీనిపై నెటిజెన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. కార్తీ ఇందులో తప్పేమి మాట్లాడాడు?, పవన్ కళ్యాణ్ ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడు అని అంటున్నారు.