Telangana Tourism: ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే మరింత ఇష్టం ఉంటుంది. కొన్ని ప్రాంతాలు తిరగడం మరింత ఇష్టం. హైదరాబాద్ నగరంలో చాలా ప్లేస్ లు ఉన్నాయి. కానీ వాటిని చూడాలంటే ఒక రోజు అసలు సరిపోదు కదా. అయినా సరే చూడాలి అనిపిస్తే వెళ్లాల్సిందే. కొన్నింటికి రూట్స్ తెలియవు. కొన్నింటికి వసతులు ఉండవు. ఎన్ని తంటాలు అయిన పడి వెళ్లాలి అనుకున్న ప్రాంతానికి వెళ్లాల్సిందే. దాన్ని మొత్తం చుట్టి రావాల్సిందే అనుకుంటారు కొందరు. ఇక టూరిజంను ఇష్టపడే వాళ్లకు తెలంగాణ టూరిజం శాఖ ఓ అద్భుతమైన ప్యారేజీని ప్రకటించింది. అది వింటే ఫుల్ హ్యాపీ అవుతారు. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? అయితే స్టోరీని చదివేసేయండి.
హైదరాబాద్ నగరాన్ని చుట్టేయాలి అనుకుంటున్నారా..? ఆఫర్, ఆఫర్, ఆఫర్ అన్నట్టుగా కేవలం రూ. 380కే ఈ ప్యాకేజీని అందిస్తుంది టూరిజం శాఖ. అంతేకాదండోయ్ ఈ ట్రిప్ వన్ డేలోనే పూర్తి అవుతుంది. దీని కోసం మీరు టూరిజం వెబ్ సైట్లోకి వెళ్లి టికెట్లను బుకింగ్ చేసుకోవాలి. తెలంగాణ టూరిజం కొత్త కొత్త ప్యాకేజీలను తీసుకు వచ్చే పనిలోనే ఉంటుంది. అందులో భాగమే ఇది. కేవలం రాష్ట్రం పరిధిలోనే కాకుండా… మిగతా ప్రాంతాల్లో ఉన్న టూరిజం ప్లేజ్ ను కూడా చూపించేందుకు ఆపరేట్ చేస్తోందట. వీటిని తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకు వచ్చింది కూడా. ఇక హైదరాబాద్ నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వీలుగా కొత్త ప్యాకేజీని ప్రజల ముందుకు తీసుకొని వచ్చింది.
HYDERABAD CITY TOUR పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించింది టూరిజం శాఖ. https://tourism.telangana.gov.in/p వెబ్ సైట్ లోకి ఈ ప్యాకేజీ వివరాలను చెక్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే బుకింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రతి రోజు ఉంటుంది కాబట్టి మీకు వీలున్న తేదీలను ఎంచుకోని బుకింగ్ చేసుకోవచ్చు.
చూపించే ప్రాంతాలు:
ఈ ట్రిప్ లో భాగంగా చార్మినార్, మక్కా మసీదు, బిర్లా మందిర్, చౌమహల్లా ప్యాలెస్, నిజాం కుపురానీ పెవిలియోన్, గుపురానీ పెవిలియన్, లాడ్ బజార్‌లో షాపింగ్, సాలార్ జంగ్ మ్యూజియం, షాహీ టూంబ్స్, లుంబినీ పార్క్ ను చూపిస్తారు.
అయితే హైదరాబాద్ లోని హియామయత్‌నగర్ వద్ద స్టార్ట్ అవుతారు. అన్ని మ్యూజియంలు శుక్రవారం క్లోజ్ చేసి ఉంటాయి కాబట్టి ఆ రోజు మాత్రం వీటికి బదులుగా నెహ్రూ జూ పార్క్ కవర్ చేస్తారు. ప్రతి శుక్రవారం 7 స్థలాలు, మిగిలిన అన్ని రోజులు 9 స్థలాలు టూర్ ప్యాకేజీ లో అందుబాటులో ఉంటాయి. మీరు వెళ్లే రోజును బట్టి ఈ విషయంలో ఓ అంచనాకు వచ్చి మీ ట్రిప్ ను బుక్ చేసుకోండి..
నాన్ ఏసీలో పెద్ద వారికి రూ. రూ.380. చిన్నారులకు రూ.300గా నిర్ణయించారు. ఏసీ జర్నీలో అయితే పెద్దలకు రూ.500, చిన్నారులకు రూ.400గా ఫిక్స్ చేశారు. అయితే మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే ఉదయం 7.30 AM – రిజర్వేషన్ కార్యాలయం, TSTDC, యాత్రి నివాస్, S.P.రోడ్, సికింద్రాబాద్, ఫోన్: 9848126947 చేసి వివరాలు తెలుసుకోవచ్చు. లేదంటే నేరుగా సంప్రదించవచ్చు. ఇదే కాకుండా ఉదయం 07:45 గంటలకు- రిజర్వేషన్ కార్యాలయం, TSTDC, టూరిజం ప్లాజా, బేగంపేట్, హైదరాబాద్- ఫోన్: 8367285285కు కాల్ చేసి వివరాలను కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ప్యాకేజీ బుకింగ్ డైరెక్ట్ లింక్ ద్వారా కూడా మీరు మీ ప్యాకేజ్ ను బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఆ లింక్ ఇదే.. https://tourism.telangana.gov.in/toursList?type=Road&groupCode=1&serviceCode=18&journeyDate=2024-09-22&adults=2&childs=0