Homeఎంటర్టైన్మెంట్పాక్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఆర్మీ.. హైద్రాబాద్‌ పోలీసుల అల‌ర్ట్‌!

పాక్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఆర్మీ.. హైద్రాబాద్‌ పోలీసుల అల‌ర్ట్‌!

సినీ న‌టుడిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టార్ డ‌మ్ ఏంట‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. అంద‌రిక‌న్నా భిన్నంగా సాగిపోయే ఆయ‌న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే.. ఎవ్వ‌రికైనా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ప‌వ‌ర్ స్టార్ రీ-ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. సోష‌ల్ మీడియాలో వారి హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. ఇదంతా కామ‌న్‌. అయితే.. ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ వైర‌ల్ అవుతోంది.

పాకిస్తాన్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ పేరిట‌ ఓ ట్విట‌ర్ అకౌంట్ ఓపెన్ అయ్యింది. ఇది చూసిన వారంతా షాక‌వుతున్నారు. ప‌వ‌న్ స్టార్ డ‌మ్ దేశ స‌రిహ‌ద్దులు దాటిపోవ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. కానీ.. పాకిస్తాన్ పేరుతో అభిమాన సంఘం ఏర్పాటు కావ‌డ‌మే హాట్ టాపిక్ గా మారింది.

అంతేకాకుండా.. ‘‘ఇక మేము ట్విట‌ర్ లో ప్ర‌వేశించాం’’ అంటూ క్యాప్షన్ ఇవ్వ‌డం కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతోపాటు హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైం విభాగానికి ఈ పోస్టును ట్యాగ్ చేయ‌డం సంచ‌ల‌నం క‌లిగించింది. దీంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఈ అకౌంట్ నిజంగానే పాకిస్తాన్ నుంచి ఓపెన్ అయ్యిందా? వేరే ఎవరైనా తెరిచారా? అని పరిశీలిస్తున్నారు.

ఇదిలాఉంటే.. సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ జోరుమీదున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా నాలుగు సినిమాల‌ను లైన్లో పెట్టాడు. తొలిసినిమా వ‌కీల్ సాబ్ భారీ విజ‌యం సాధించింది. దీని త‌ర్వాత హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, అయ‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్ తోపాటు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌బోతున్నారు. వ‌చ్చే నెల‌లో ప‌వ‌న్ బ‌ర్త్ డే ఉండ‌డంతో.. ఏకే రీమేక్ టీజ‌ర్ కోసం ఫ్యాన్స్ ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper
Exit mobile version