
రాష్ట్రాల స్థాయిలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని కట్టబెడుతూ తీసుకువచ్చిన బిల్లుపై మంగళవారం లోక్ సభలో చర్చ జరుగుతోంది. కాగా ఈ 127 వ రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో విపక్షాలు ప్రభుత్వానికి మద్దుతు ప్రకటించాయి. అందుకు తగ్గట్టే బిల్లుపై చర్చ జరుగుతోన్న సమయంలో ఎలాంటి ఆందోళన చేయకుండా చర్చలో పాల్గొన్నాయి. అలాగే తాము ఓబీసీ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురీ వెల్లడించారు.