Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan directing again: పవన్ కళ్యాణ్ మరోసారి డైరెక్షన్ చేయబోతున్నారా..? కథేంటి ఇంత వైలెంట్...

Pawan Kalyan directing again: పవన్ కళ్యాణ్ మరోసారి డైరెక్షన్ చేయబోతున్నారా..? కథేంటి ఇంత వైలెంట్ గా ఉంది..?

Pawan Kalyan directing again: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరి పేరు చెబితే ప్రేక్షకుల్లో ఒక ఉత్తేజం వస్తుందో? ఎవరి సినిమా కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తారో? అతనే పవన్ కళ్యాణ్… మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా అవతరించాడు. మొత్తానికైతే పవర్ స్టార్ అనే ట్యాగ్ కి న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. జనసేన పార్టీని స్థాపించి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టినప్పటికి ఆయనకు సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మాత్రం తగ్గడం లేదు. అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. ఇక గత సంవత్సరం సుజిత్ డైరెక్షన్లో చేసిన ‘ఓజీ’ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేసింది… ఇక ఈ సంవత్సరం మార్చి 26వ తేదీన రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో మరోసారి పెను సంచలనానికి క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు… పవన్ కళ్యాణ్ ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారి మాత్రమే మెగా ఫోన్ పట్టుకున్నాడు.

‘జానీ’ సినిమాకి తనే డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో అప్పటి నుంచి ఇప్పటివరకు మరోసారి ఆయన డైరెక్షన్ చేయలేదు. కానీ ఇప్పుడు ఒక సినిమాని డైరెక్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది…

Also Read: విజయ్ దేవరకొండ – రష్మిక హనీమూన్ కోసం ఏ దేశం వెళ్లబోతున్నారంటే..?

ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికి ఆయన ఎలాగైనా సరే ఒక సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాని తీసి ప్రేక్షకుల ముందు ఉంచాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక అందులో తనే హీరోగా నటించాలని కూడా చూస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అది కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనే ధోరణిలో కూడా మరికొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి…

ఇక ఈ సినిమాకి కథ మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ హీరో గా త్రివిక్రమ్ డైరెక్షన్ లో రావాల్సిన సినిమా ఇదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మూవీ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. చాలా వైలెంట్ గా ఉండబోతుందట. అంత బాగానే ఉంది కానీ ఈ సినిమా పట్టాలెక్కుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది… చూడాలి మరి ఈ సినిమా తో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ గా తన సత్తా చాటుకుంటాడా లేదా అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular