https://oktelugu.com/

Pawan Kalyan: చెన్నైలో చిరంజీవి కోసం ఒక రౌడీని కొట్టిన పవన్ కళ్యాణ్… హాస్పిటల్ బిల్లు ఎవరు కట్టారంటే..?

Pawan Kalyan: కోడి రామకృష్ణ డైరెక్షన్ లో చిరంజీవి చేస్తున్న ఒక సినిమాను చెన్నైలోని కోడంబాకం లో షూటింగ్ చేస్తున్నారట. ఇక ఆ సమయంలో కోడంబాకంలో చాలామంది రౌడీ షీటర్లు ఉండేవారు.

Written By:
  • Gopi
  • , Updated On : June 14, 2024 / 10:54 AM IST

    Pawan Kalyan beat up a rowdy for Chiranjeevi in ​​Chennai

    Follow us on

    Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి అంటే తన తమ్ముడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టం.. ఇక ఆయన గురించి ఎవరైనా బ్యాడ్ గా మాట్లాడిన ఆయన సినిమాల మీద కామెంట్స్ చేసిన కూడా పవన్ కళ్యాణ్ తొందరగా రెస్పాండ్ అవుతూ వాళ్లకి సమాధానం చెబుతూ ఉంటాడు. ఇక రీసెంట్ గా పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ వాళ్ల అన్నయ్య మీద ఉన్న అభిమానాన్ని తన కాళ్లు మొక్కుతూ చూపించిన విషయం మనకు తెలిసిందే..

    ఇక ఇది ఇలా ఉంటే 1994 వ సంవత్సరంలో కోడి రామకృష్ణ డైరెక్షన్ లో చిరంజీవి చేస్తున్న ఒక సినిమాను చెన్నైలోని కోడంబాకం లో షూటింగ్ చేస్తున్నారట. ఇక ఆ సమయంలో కోడంబాకంలో చాలామంది రౌడీ షీటర్లు ఉండేవారు. ఇక షూటింగ్ గ్యాప్ లో చిరంజీవి దగ్గరికి ఒక రౌడి వచ్చి దుర్భాషలాడారట. ఇక దానికి చిరంజీవి కామ్ గా ఉండి షూటింగ్ చేసుకొని వెళ్తే అయిపోతుంది. వాళ్లతో గొడవ ఎందుకు అని అనుకున్నారట.

    Also Read: Rashmika Mandanna: స్టుపిడ్ ని నమ్మితే భయంకరం… కీలకంగా రష్మిక మందాన కామెంట్స్

    కానీ వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేద్దాం అని చెప్పిన చిరంజీవి వాటిని పట్టించుకోకుండా షూటింగ్ లో నిమగ్నమయ్యాడట. ఇక బ్రేక్ తర్వాత షూటింగ్ లొకేషన్ లో ఎవరు లేకపోవడంతో ఏం జరుగుతుంది అని చిరంజీవి తన అసిస్టెంట్ ని అడిగితే మీతో బ్యాడ్ గా మాట్లాడిన రౌడీలతో పవన్ కళ్యాణ్ గొడవ పెట్టుకుంటున్నాడు అని చెప్పాడట. ఇక దాంతో చిరంజీవి అక్కడికి వెళ్ళేసరికే ఆ రౌడీ పవన్ కళ్యాణ్ తో వాగ్వివాదం చేస్తూ అతని మీద చేయి చేసుకున్నాడట.

    Also Read: Devara: ఎన్టీయార్ దేవర సినిమా కంటే వార్ 2 సినిమా పెద్ద విజయం సాధిస్తుందా..?

    ఇక దాంతో మాట అంటేనే పడని పవన్ కళ్యాణ్ వాడు చేయి వేయడంతో వాణ్ణి అక్కడే చితక్కొట్టాడట. ఇక చిరంజీవి వచ్చి ఆ గొడవను ఆపేసాడట. ఇక బాగా దెబ్బలు తిన్న రౌడీని హాస్పిటల్ లో చేర్పించారట. అప్పుడు చిరంజీవి నీకు మార్షల్ ఆర్ట్స్ వస్తే మాత్రం ఎవరిని పడితే వారిని కొడతావా అంటూ పవన్ కళ్యాణ్ తో గొడవ పెట్టుకొన్నాడట. ఇక మొత్తానికైతే చిరంజీవి హాస్పిటల్ కి వెళ్లి ఆ రౌడీని పరామర్శించారట. ఇక హాస్పిటల్ బిల్లు మొత్తం పవన్ కళ్యాణ్ కట్టాడట…ఇలా పవన్ కళ్యాణ్ కి చిరంజీవి అంటే ఎంత ఇష్టమో అప్పటినుంచి తన మాటలు చేతుల ద్వారా నిరూపించుకుంటూ వస్తున్నాడు. ఇక ఈ విషయాన్ని కోడి రామకృష్ణ ఒక సందర్భంలో తెలియజేయడం విశేషం…