https://oktelugu.com/

Rashmika Mandanna: స్టుపిడ్ ని నమ్మితే భయంకరం… కీలకంగా రష్మిక మందాన కామెంట్స్

Rashmika Mandanna: గత ఏడాది రణబీర్ కపూర్ - రష్మిక జంటగా నటించిన యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. దాదాపు రూ. 900 వందల కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో గీతాంజలి పాత్రలో రష్మిక అద్భుతంగా నటించింది.

Written By:
  • S Reddy
  • , Updated On : June 14, 2024 / 10:21 AM IST

    Rashmika calls Ranbir Kapoor Animal character a stupid man

    Follow us on

    Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాలీవుడ్ టు బాలీవుడ్ ఊపేస్తోంది. ఆమె కెరీర్ పీక్స్ లో ఉంది. అమ్మడి చేతిలో డజను సినిమాలు ఉన్నాయి. అవి కూడా పాన్ ఇండియా లెవెల్ భారీ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది రష్మిక. అయినప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా రష్మిక ఓ నెటిజన్ కు ఆసక్తికరమైన రిప్లై ఇచ్చారు. రష్మిక ఇచ్చిన ఆన్సర్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.

    గత ఏడాది రణబీర్ కపూర్ – రష్మిక జంటగా నటించిన యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. దాదాపు రూ. 900 వందల కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో గీతాంజలి పాత్రలో రష్మిక అద్భుతంగా నటించింది. రన్బీర్ కపూర్ ఈ చిత్రంలో రష్మిక మందానను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ తర్వాత జోయా అనే అమ్మాయితో సంబంధం పెట్టుకుంటాడు. అది తెలిసిన రష్మిక చాలా బాధ పడుతుంది.

    Also Read: Oopiri: ఊపిరి సినిమాలో నాగార్జున కార్తీ మొదటి చాయిస్ కాదట… ఎవరిని అనుకున్నారంటే..?

    ఆ వీడియోని షేర్ చేస్తూ ఓ నెటిజన్ ” గుర్తుంచుకోండి .. మనిషిని నమ్మడం కంటే భయంకరమైనది ఏది ఉండదు ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది నెటిజెన్. దీనిపై రష్మిక స్పందించింది. పోస్ట్ కి రిప్లై ఇస్తూ .. ” కరెక్షన్ .. స్టుపిడ్ ని నమ్మితే భయంకరం. చాలా మంది మంచి పురుషులు కూడా ఉన్నారు. వారిని నమ్మడం కూడా ప్రత్యేకమే ” అంటూ లవ్ ఎమోజి ని షేర్ చేసింది. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారింది.

    Also Read: Anasuya Bharadwaj: చేసిన తప్పుకు పశ్చాత్తాపం… పబ్లిక్ గా క్షమాపణలు అడిగిన ఫైర్ బ్రాండ్ అనసూయ!

    ఇక త్వరలో రష్మిక పుష్ప 2 లో శ్రీవల్లి గా ప్రేక్షకులను మెప్పించనుంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో మూడు సినిమాలకు సైన్ చేసింది. రైన్ బో, గర్ల్ ఫ్రెండ్ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తుంది. పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ చిత్రం నుండి విడుదలైన రెండు సాంగ్స్ ఆదరణ పొందాయి. రష్మిక బర్త్ డే కానుకగా విడుదల చేసిన లుక్ ఆకట్టుకుంది.