spot_img
Homeవింతలు-విశేషాలుKallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే గుర్తించారు. ఇందులో భాగంగా వేల ఏళ్ల క్రితమే రాజులు, పాలకులు నదుల ప్రవాహాన్ని నియంత్రించేందుకు చెరువులు, కాలువలు, ఆనకట్టలు నిర్మించారు. ఈ నిర్మాణంలో భాగంగా భారతదేశంలో అతి పురాతనమైన డ్యామ్ గా తమిళనాడులో ఉన్న కళ్ళనై ప్రత్యేకంగా నిలుస్తుంది. అసలు ఈ డ్యామ్ ను ఎప్పుడు నిర్మించారు? ఎలా నిర్మించారు? ఈ డ్యామ్ విశేషాలు ఏంటి?

భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే పురాతనమైన నీటిపారుదల ప్రాజెక్టుల్లో తమిళనాడులోని కళ్లనై డ్యామ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. దీనిని గ్రాండ్ ఆనికట్ అని కూడా పిలుస్తారు. దాదాపు 2000 సంవత్సరాల క్రితం దీనిని నిర్మించినట్లు చరిత్ర తెలుపుతోంది. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు, తిరుచిరాపల్లి జిల్లాల మధ్య ఉన్న ఈ డ్యామ్ రెండవ శతాబ్దానికి చెందినదిగా పేర్కొంటున్నారు.

పురాణాల ప్రకారం చోళ రాజు కరికాల చోళుడు కావేరి నది ప్రవాహాన్ని నియంత్రించి, డెల్టా ప్రాంతంలోని వ్యవసాయానికి నీటిని అందించేందుకు కళ్లనై డ్యామ్ ను నిర్మించినట్లు చెబుతున్నారు. అప్పట్లో కావేరి వరదలు విపరీతంగా ఉండేవి. కానీ వ్యవసాయానికి నీరు మాత్రం అందేవి కాదు. దీని ప్రవాహాన్ని నియంత్రిస్తే వ్యవసాయం పండుతుందని భావించి ఈ డ్యామ్ ను నిర్మించారు.

కళ్లనై డ్యామ్ నిర్మాణంలో ప్రధానంగా రాళ్ళను ఉపయోగించారు. ఈ పురాతన ఆనకట్ట సుమారు 329 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు కలిగే ఉంది. ఈ ఆనకట్ట కావేరీ నది నీటిని నియంత్రించడం తో పాటు సరైన దిశలో నీటిని మళ్లించేలా ప్రత్యేకంగా నిర్మించారు. సాధారణంగా డాం లేదా రిజర్వాయర్లు నీటిని నిల్వ చేసి వరదలు వచ్చినప్పుడు కిందికి వదులుతారు. కానీ కళ్లనై డ్యామ్ ఉద్దేశం వేరు. ఇది కావేరీ నది ప్రవాహాన్ని నియంత్రించి డెల్టా ప్రాంతాలకు నీటిని మళ్లిస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో ఇప్పుడు లక్షలాది ఎకరాల్లో వ్యవసాయం అభివృద్ధి చెందింది.

2000 సంవత్సరాల కింద నిర్మించిన ఈ డ్యామ్ ఇప్పటికీ నాణ్యతతో కొనసాగుతుంది. కాలక్రమంలో ఈ ప్రాంతంలో అనేక మార్పులు, ఆధునిక నిర్మాణాలు చేసుకున్నప్పటికీ.. పురాతన కట్టడాలు మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ డ్యామ్ ను అభివృద్ధి చేయడంలో బ్రిటిష్ పాలకులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తెలుస్తోంది. కళ్లనై డ్యామ్ కేవలం నీటిని అందించడమే కాకుండా పర్యాటక ప్రదేశంగా ప్రఖ్యాతను కలిగి ఉంది. ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉల్లాసంగా గడుపుతారు. ఈ ఆనకట్ట పై నిర్మించిన వంతెన, రోడ్డుతో ఈ ప్రాంతం సుందరమయంగా మారిపోయింది. అయితే దీనిని దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పురాతనమైన డ్యామ్ గా పేర్కొంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Oktelugu Epaper
Exit mobile version