Pawan Kalyan And Surender Reddy Film Story: ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీతో సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్… ఆ తర్వాత పవర్ స్టార్ గా తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకొని యూత్ లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికి అవకాశం దొరికిన ప్రతీసారి సినిమాలను చేస్తూ తన అభిమానులను అలరిస్తున్నాడు. ఇక గత సంవత్సరం ‘ఓజీ’ సినిమాతో ప్రేక్షకలోకాన్ని ఉర్రూతలుగించిన ఆయన ఈ సంవత్సరం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో మరోసారి సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ప్రస్తుతం ఒప్పుకున్న అన్ని సినిమాలను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా నిన్న ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ బయటికి వచ్చింది.
ఈ సినిమా కన్ఫర్మ్ అయింది తొందర్లోనే సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ దర్శకుడు స్పందించాడు. ఈ సినిమా ఎలాంటి కథతో తెరకెక్కుతోంది అనే ధోరణిలో ప్రతి ఒక్కరిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక ఈ సినిమాలో సొసైటీ లో జనాలు ఎలా ఉండాలి, రాజకీయ నాయకులు ఎలాంటి పనులను చేయాలి.
ఎవరు ఎలా ఉంటే సొసైటీ బాగుంటుంది అనే ఒక పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారట. ఒక రకంగా చెప్పాలంటే ఇది పొలిటికల్ గా సాగే సినిమాగానే తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రను పోషిస్తున్నాడుఅనే డౌట్ అందరిలో కలుగుతోంది… ఈ సినిమాలో సీఎం క్యారెక్టర్ ని చేస్తున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ కనక సీఎం పాత్ర చేస్తే సినిమాకి భారీ హైప్ వస్తోంది. అలాగే సినిమా కూడా సూపర్ సక్సెస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి… ఇక ఏది ఏమైనా కూడా సమాజంలో చైతన్యాన్ని నింపడానికి పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి సినిమాలు వస్తే బాగుంటుందని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…