The Paradise Updates: భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమాల్లో శ్రీకాంత్ ఓదెల – నాని కాంబినేషన్లో వస్తున్న ‘ప్యారడైజ్’ సినిమా ఒకటి… ఈ సినిమా మీద మొదటి నుంచి భారీ అంచనాలైతే ఉన్నాయి. ప్యారడైజ్ సినిమా గ్లింప్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటినుంచి ఈ సినిమా మీద అంచనాలు తార స్థాయికి చేరిపోయాయి. ఇక దానికి తగ్గట్టుగానే దర్శకుడు ప్రతి ఒక్క అప్డేట్ ను ఇస్తూ ప్రేక్షకుల్లో జోష్ నింపుతున్నాడు. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ‘జడల్ జమానా’ అంటూ నాని ఒక పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ ను చూస్తే నాని మాస్ హీరోగా మారిపోయాడు. అనే విషయమైతే మనకు తెలిసిపోతుంది. ఇక మాస్ హీరో అవతారం ఎత్తుతున్న నాని ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… స్టార్ హీరోలతో పోటీపడి ఏ రేంజ్ కి నాని ఎదగబోతున్నాడు అనేది ఈ ఒక్క సినిమా ప్రూవ్ చేయబోతోంది అంటూ నాని అభిమానులు సైతం ఆనందపడుతున్నారు. ఈ సినిమాతో నాని టైర్ వన్ హీరోగా మారితే మాత్రం మిగతా స్టార్ హీరోలందరికి కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశాలైతే ఉన్నాయి.
ఇప్పటివరకు నాని సాఫ్ట్ సినిమాలను మాత్రమే చేసుకుంటూ వెళ్తాడని అందరూ అనుకున్నారు. కానీ దసర సినిమాతో తనలోని మాస్ యాంగిల్ ను పరిచయం చేసిన నాని ప్యారడైజ్ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
ఇక తను మాస్ హీరోగా మారితే స్టార్ హీరోల దగ్గరికి వెళ్లాల్సిన కొన్ని ప్రాజెక్టులు నాని కొట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని వల్ల స్టార్ హీరోలకు కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశాలైతే ఉన్నాయని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఇక ఇప్పటివరకు ఉన్న స్టార్ హీరోలందరూ వారసత్వ బ్యాగ్రౌండ్ తో ఉన్నవాళ్లే కావడం విశేషం…
మరి ఇప్పుడు నాని కనక ప్యారడైజ్ సినిమాతో టైర్ వన్ హీరోగా మారితే సోలోగా ఇండస్ట్రీకి వచ్చి టైర్ వన్ హీరోగా మారాడు అంటూ నాని హిస్టరీని క్రియేట్ చేస్తాడు… ఇక నాని భవిష్యత్తు ఎలా ఉంది అనేది ప్యారడైజ్ మూవీ మాత్రమే తేల్చబోతోంది అంటూ క్రిటిక్స్ సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…