Jana Nayagan: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో విజయ్ హీరోగా చేస్తున్న ‘జన నాయగన్’ అనే సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా బాలయ్య బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది అనే వార్తలు వచ్చినప్పటికి సినిమా దర్శకుడు మాత్రం దీని మీద క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు. ఇక అనిల్ రావిపూడిని సైతం జననాయక్ సినిమా భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ గా వస్తుందా అని అడిగినప్పుడు ఏమో మనకు తెలియదని ఆ మూవీ దర్శకుడు సైతం దాని మీద స్పందించడం లేదు కాబట్టి మనం ఇప్పుడే అది రీమేక్ అని చెప్పలేము అంటూ ఆయన సమాధానం ఇచ్చాడు. ఇక విజయ్ చివరి చిత్రం గా తెరకెక్కుతున్న ఈ సినిమా భగవంత్ కేసరి సినిమాకి రీమేగా తెరకెక్కినప్పటికి వాళ్ళు ఎందుకు ఆ విషయాన్ని బయటకు చెప్పడం లేదంటే ఈ సినిమాని తెలుగులో సైతం రిలీజ్ చేస్తున్నారు.
భగవత్ కేసరి సినిమాకి రీమేక్ గా వస్తుంది అంటే తెలుగులో ఏమాత్రం అంచనాలు ఉండవని కనీసం ఓపెనింగ్స్ కూడా రావనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ సినిమాని అఫీషియల్ గా రీమేక్ అని చెప్పడం లేదు. ఈ సినిమాని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో విజయ్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.
తన చివరి సినిమాతో భారీ విజయాన్ని అందుకొని అక్కడితో సినిమాలకు పులిస్టాప్ పెట్టి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోవాలని చూస్తున్నాడు… ఒకవేళ రాజకీయ రంగంలో అతను పెద్దగా రాణించకపోతే మరోసారి సినిమాలు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొంతమంది ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
కానీ విజయ్ మాత్రం ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తను సినిమాలు చేయబోనని ఒక ఇంటర్వ్యూలో క్లారిటీగా చెప్పాడు…నిజానికి విజయ్ కి తమిళంలో భారీ మార్కెట్ ఉంది. కానీ ఆయన ఇండస్ట్రీ ని వదిలేసి ఇప్పుడు ఇలా రాజకీయ రంగంలోకి వెళ్ళడం అనేది అతని అభిమానులను కొంతవరకు ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి…