Pawan Kalyan : ప్రస్తుతం ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూ పేద ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక అడపా దడపా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న ఆయన డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటి నుంచి అసలు సినిమా షూటింగ్ లో ఎక్కువగా పాల్గొనడం లేదు. ఇక అంతకుముందే సెట్స్ మీద ఉంచిన మూడు సినిమాలను ఫినిష్ చేసి సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనే ఉద్దేశ్యం లో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి ఈ మూడు సినిమాలను సైతం ఎప్పుడు కంప్లీట్ చేస్తారనే విషయం మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ క్యాన్సిల్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఈ సినిమా స్టార్ట్ అయి నాలుగు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో గత సంవత్సరం ఈ సినిమా డైరెక్టర్ అయిన క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నాడు.
Also Read : ఒకే వేదికపై పవన్ కళ్యాణ్, ప్రభాస్..ఫ్యాన్స్ కి పండగే..మొత్తానికి మోహన్ బాబు సాధించాడు!
ఈ సినిమాకి ఏ ఏం రత్నం కొడుకు అయిన జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ ని తొందర్లోనే అనౌన్స్ చేస్తామంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నమైతే చేశారు.
ఇక ఇదిలా ఉంటే ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలు సైతం సెట్స్ మీద ఉన్నాయి. ఈ లెక్కన సుజీత్, హరిష్ శంకర్ లాంటి దర్శకుల జీవితాలతో పవన్ కళ్యాణ్ అడుకుంటున్నాడని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలను కంప్లీట్ చేయలేక వాళ్లు వేరే సినిమాలకు వెళ్లలేక ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటూ ఆ దర్శకులు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా క్రిష్ లాంటి దర్శకుడు తెలివిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి తప్పించుకున్నాడు అంటు కొంతమంది కామెంట్లు చేస్తుంటే మరి కొంతమంది మాత్రం సుజిత్, హరిష్ శంకర్ మాత్రం ఇక్కడే ఇరుక్కున్నారు అంటూ వాళ్ల మీద సెటైర్లు అయితే వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైతం వీలైనంత తొందరగా ఈ సినిమాలను కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే బాగుంటుంది అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…
Also Read : మెగాస్టార్ చిరంజీవి కి అరుదైన పురస్కారం అందించిన లండన్ ప్రభుత్వం..దేశంలోనే మొట్టమొదటి భారతీయుడు!