Coolie Movie First Review : ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలందరు అడపా దడపా సినిమాలను చేస్తూ మంచి విజయాలను సాధిస్తున్నారు. వాళ్ళు ఎంత మంచి సక్సెస్ సాధించిన కూడా 200 కోట్లకు మించి కలెక్షన్లను రాబట్టలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళ సినిమాలను చూడడానికి యూత్ ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదనేది వాస్తవం. మరి ఇదిలా ఉంటే రజనీకాంత్ లాంటి స్టార్ హీరో మాత్రం ఆయన చేస్తున్న సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. జైలర్ (Jailer) సినిమాతో 400 కోట్ల మార్కును టచ్ చేసిన ఆయన ఇప్పుడు రాబోతున్న కూలీ మూవీతో 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడతాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి…
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరో రజనీకాంత్(Rajinikanth)… ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ముఖ్యంగా తమిళ్ తో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయనకు చాలా మంచి గుర్తింపైతే లభించింది. ఆయన చేసిన ప్రతి సినిమా తెలుగు లోకి డబ్ అవుతుండడం వల్ల యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులు సైతం ఆయన సినిమాలను చూస్తూ ఇక్కడ కూడా ఆయనను సూపర్ స్టార్ గా మార్చారు. ఇక ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఎక్కడ తగ్గకుండా యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. ఇక లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj) లాంటి స్టార్ డైరెక్టర్ తో ప్రస్తుతం ఆయన కూలీ (Cooli) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి గ్యాంగ్ స్టర్ గా రజనీకాంత్ కనిపించబోతున్నాడు.
Also Read : రజినీకాంత్ కూలీ సినిమాలో చిరంజీవి నటిస్తున్నాడా..? ఇంతకీ ఆయన ఏ పాత్ర చేస్తున్నాడు…
ఈ సినిమాతో ఆయన యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న రజనీకాంత్ మరోసారి తన మార్క్ స్టామినాను చూపించడానికి సిద్ధమవుతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే కూలీ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లు ఈజీగా రాబడుతుందంటూ కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ ని కూడా రజనీకాంత్ సన్నిహితులు చెబుతూ ఉండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా రజనీకాంత్ 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టగలిగితే ఈ ఏజ్ లో సైతం రజనీకాంత్ ను టచ్ చేసే పాన్ ఇండియా హీరో మరొకరు ఉండరు అనేది చాలా క్లియర్ గా తెలిసిపోతుంది.
సూపర్ స్టార్ ను మించిన హీరో మరొకరు లేరు అనేది మరోసారి తేటతెల్లమవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అందుకే రజనీకాంత్ ఈ సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెట్టి సినిమాను చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆయన ఏ సినిమా చేసిన కూడా అందులో 100% ఎఫర్ట్స్ పెడుతూ సినిమా చాలా బాగా వచ్చే విధంగా చూసుకుంటూ ప్రతి ఒక్కరిని అలరిస్తూ తన క్యారెక్టర్ తో ఆ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు…
Also Read : రజినీకాంత్ కూలీ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో…మరో రోలెక్స్ అవుతాడా