Pawan Kalyan And Anil Ravipudi: ప్రతీ సంక్రాంతికి సీనియర్ హీరోలతో రావడం, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కొల్లగొట్టడం అనిల్ రావిపూడి(Anil Ravipudi) కి వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తో భారీ కమర్షియల్ హిట్ ని అందుకొని 300 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన అనిల్ రావిపూడి, ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం తో మరో 300 కోట్ల గ్రాసర్ ని అందుకున్నాడు. ఇలాంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత అనిల్ రావిపూడి ఎలాంటి సినిమా చేయబోతున్నాడు, ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే, ఆయన తదుపరి చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో ఉండబోతుందని అంటున్నారు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తాడట. ఇదే కనుక నిజమైతే, స్టార్ హీరో తో పని చేయడం ఇది అనిల్ రావిపూడి కి రెండవ చిత్రం అనొచ్చు.
గతం లో ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా చేసాడు. ఈ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ మహేష్ బాబు కెరీర్ లో ఈ సినిమానే హైయెస్ట్ గ్రాసర్ గా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేది అభిమానుల్లో కలిగిన ఉత్కంఠ. హీరో కి తగ్గట్టు స్క్రిప్ట్ ని రెడీ చేయడం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు డైలాగ్స్ రాసుకొని ఫన్ పుట్టించడం అనేది అనిల్ రావిపూడి కి కొట్టినపిండి లాంటిది. పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమధ్య కాలం లో ఆయన కామెడీ టైమింగ్ ఉండే సినిమాలు చేయడం లేదు. అనిల్ రావిపూడి ఆయనలోని వింటేజ్ కామెడీ టైమింగ్ ని బయటకు తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ అవుతాయి.
సరిగా అనిల్ రావిపూడి అదే చేయబోతున్నాడని టాక్. పవన్ కళ్యాణ్ కి ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ని ఆయన సిద్ధం చేసాడట, ఇందులో పవన్ కళ్యాణ్ ని లెక్చరర్ రోల్ లో చూపించబోతున్నట్టు సమాచారం. అంటే మిరపకాయ్ లాంటి సినిమాలో పవన్ కళ్యాణ్ ని త్వరలోనే మనం చూడబోతున్నాం అన్నమాట. అలాంటి హీరోయిజం, కామెడీ టైమింగ్, ఎలివేషన్స్ పవన్ కళ్యాణ్ కి పడితే 500 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టడం పెద్ద కష్టమేమి కాదు. ఈ ఏడాది ఏప్రిల్ నుండి పవన్ కళ్యాణ్ ముందుగా సురేందర్ రెడ్డి తో సినిమాని ప్రారంభిస్తాడు, ఆ తర్వాత రెండు నెలలకు అనిల్ రావిపూడి సినిమాని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనేది.
