WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ విజయవంతంగా సాగుతోంది. ఇప్పటివరకు 11 మ్యాచులు జరిగాయి.. ఈ సీజన్లో బెంగళూరు జట్టు వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. తద్వారా రెండవసారి ట్రోఫీని అందుకోవడానికి వేగంగా అడుగులు వేస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విషయాలలో బెంగళూరు జట్టు సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.. అయితే ఈసారి జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అభిమానులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది.
ప్రస్తుత సీజన్ లో ఇప్పటివరకు 11 మ్యాచ్ లు జరిగాయి. పరుగులపరంగా బ్యాటర్లు సాధించిన యావరేజ్ ఈసారి ఇప్పటివరకు 27.9 గా నమోదయింది. స్ట్రైక్ రేట్ 141.27 గా కొనసాగుతోంది. 21 హాఫ్ సెంచరీలు నమోదు అయ్యాయి. ఇందులో 438 బౌండరీలు ఉన్నాయి. 121 సిక్సర్లు ఉన్నాయి.. ప్రతి 26.2 బంతులకు ఒక ఫోర్ నమోదవుతుంది. ప్రతి 21.2 బంతులకు ఒక సిక్సర్ నమోదవుతోంది.. బౌండరీల శాతం 21.76 గా నమోదయింది.
2023లో 22 మ్యాచులు జరిగాయి. అప్పుడు బ్యాటర్ల సరాసరి 24.23, స్ట్రైక్ రేట్ 128.37 గా నమోదయింది. ఏకంగా 31 హాఫ్ సెంచరీలను బ్యాటర్లు చేశారు. ఇందులో ఫోర్లు 801, సిక్సర్లు 159 నమోదయ్యాయి. ప్రతి 30.63 బంతులకు ఒక బౌండరీ నమోదయింది. బౌండరీ శాతం 19.71 గా నమోదయింది.
2024 సీజన్లో 22 మ్యాచులు జరిగాయి. బ్యాటర్లు 23.48 యావరేజ్, 124.42 స్ట్రైక్ రేట్ నమోదు చేశారు. ఇందులో హాఫ్ సెంచరీలు 32 నమోదు అయ్యాయి. ఫోర్లు 752, సిక్సర్లు 168 నమోదయ్యాయి. ప్రతి 30 బంతులకు ఒక బౌండరీ నమోదయింది. బౌండరీ శాతం 18.25 గా నమోదయింది.
2025లో 22 మ్యాచులు జరిగాయి. ఇందులో బ్యాటర్ల యావరేజ్ 23.36, స్ట్రైక్ రేట్ 132.68 గా నమోదయింది. 38 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. బౌండరీలు 815, సిక్సర్లు 193 నమోదు అయ్యాయి. ప్రతి 26.2 బంతులకు ఒక బౌండరీ నమోదయింది. బౌండరీ శాతం 19.94 గా నమోదయింది. అయితే ఈ సీజన్లో ఇప్పటికే 21 హాఫ్ సెంచరీలు నమోదు కావడంతో గత రికార్డులు మొత్తం బద్దలవుతాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
