Zarina Wahab: ఒకప్పుడు అందాల తార శ్రీదేవి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి సూపర్ స్టార్స్ చిత్రాల్లో కూతురి పాత్రలు పోషించింది. కానీ పెద్దయ్యాక ఆమెనే వాళ్ళ సరసన హీరోయిన్ గా నటించింది. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. రీసెంట్ సమయం లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad garu) చిత్రం లో కూడా జరిగింది. ‘గాడ్ ఫాదర్’ చిత్రం లో చిరంజీవి కి చెల్లి గా నటించిన నయనతార(Nayanathara) , ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఆడియన్స్ కేవలం స్టోరీ ని మాత్రమే చూసారు కానీ, పోయిన సినిమాలో వీళ్లిద్దరు అన్నాచెల్లెళ్లుగా నటించారు కదా, మళ్లీ ఇప్పుడేంటి హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు లాంటివి చూడలేదు. ఇదంతా పక్కన పెడితే, ఇదే సినిమాలో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఒకటి జరిగింది.
అదేమిటంటే ఈ చిత్రం లో చిరంజీవి కి తల్లి పాత్ర పోషించిన జరీనా వాహెబ్(Zarina Wahab) కి మంచి పేరొచ్చింది. చూసేందుకు చాలా నేచురల్ గా ఉంది, సహజంగా నటించింది, మెగాస్టార్ చిరంజీవి తో తల్లిగా ఆమె కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉందంటూ చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. అయితే అసలు విషయం ఏమిటంటే జరీనా వాహెబ్ నిజ జీవితంలో వయస్సు పరంగా మెగాస్టార్ చిరంజీవి కంటే చాలా చిన్న అనే విషయం చాలా మందికి తెలియదు. మెగాస్టార్ చిరంజీవి వయస్సు 70 ఏళ్ళు కాగా , జరీనా వాహెబ్ వయస్సు 66 ఏళ్ళు మాత్రమే. కానీ సినిమాలో వీళ్లిద్దరు తల్లికొడుకు అనగానే అందరూ నమ్మేశారు. చిరంజీవి కూడా ఈ చిత్రం 70 ఏళ్ళ వయస్సు ఉన్నవాడిలాగా అసలు అనిపించలేదు. ఆయన లుక్స్ ని చూస్తే రామ్ చరణ్ కి తమ్ముడి లాగా ఉన్నాడు కానీ, తండ్రి లాగా అసలు అనిపించడం లేదు.
ఏజ్ అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే అనేది మెగాస్టార్ చిరంజీవి లాంటోళ్లకు సరిపోతాడు. 20 , 30 ఏళ్ళ వయస్సు ఉన్న కుర్రాళ్ళు కూడా అడ్డదిడ్డంగా పొట్టలు పెంచేసి, బట్ట తల వేసుకొని వికారంగా కనిపించే రోజులవి. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్ళ వయస్సులో కూడా వర్కౌట్స్ చేస్తూ ఫిట్నెస్ ని మైంటైన్ చేస్తున్నాడు. కచ్చితంగా నేటి తరం యువత ఆయన నుండి ఆదర్శంగా తీసుకోవాల్సిన అంశాల్లో ఇది కూడా కచ్చితంగా ఉండాలి. ఇక ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం విషయానికి వస్తే, ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ మార్కుని అందుకొని 300 కోట్ల గ్రాస్ వైపు పరుగులు తీస్తోంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకెన్ని అద్భుతాలను నెలకొల్పబోతుందో చూడాలి.
