Parineeti Chopra: ప్రియాంక చోప్రా-పరిణీతి చోప్రా కజిన్స్. బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చక్రం తిప్పింది. 2002లో ప్రియాంక చోప్రా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. విజయ్ కి జంటగా ఓ తమిళ చిత్రం చేసిన ప్రియాంక చోప్రా అనంతరం బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. క్రిష్, డాన్ వంటి బ్లాక్ బస్టర్స్ ఆమె ఖాతాలో పడ్డాయి. 2010 నాటికి ప్రియాంక చోప్రా కెరీర్ పీక్స్ లో ఉంది. టాప్ హీరోయిన్ గా పరిశ్రమను ఏలుతుంది. అదే సమయంలో ప్రియాంక చెల్లెలు పరిణీతి చోప్రా మాత్రం కనీసం జాబ్ లేక సమస్యలు ఎదుర్కొందట.
ఓ సందర్భంలో తాను హీరోయిన్ కాకముందు ఎదురైన దుర్భర పరిస్థితులు ఆమె గుర్తు చేసుకుంది. పరిణీతి చోప్రా మాట్లాడుతూ.. నాన్నా… నాకు డబ్బులు ఏర్పాటు చేయండి. నేను యూకే వెళతాను. మంచి జాబ్ చేసి మీరు ఖర్చు చేసి ప్రతి రూపాయి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను, అన్నాను. 2009లో నా చదువు పూర్తి అయ్యింది. 2008-2009లో ప్రపంచంలో ఆర్థిక మాంద్యం చోటు చేసుకుంది. నిరుద్యోగం ఎక్కువైపోయింది.
నా వీసా ఎక్స్పైర్ అయిపోతుంది. జాబ్ వచ్చే మార్గం లేదు. తిరిగి ఇండియా వచ్చేస్తాను అని నాన్నతో చెప్పలేకపోయాను. అప్పుడు నా బాధ అక్క(ప్రియాంక చోప్రా) వాళ్ళ అమ్మతో చెప్పాను. దయ చేసి నాకు ఒక జాబ్ చూడండి. నేను ముంబై వచ్చేస్తాను అన్నాను. సరే వచ్చేయ్ అన్నారు ఆమె. మొత్తం సర్దుకుని ముంబై వచ్చాను. కానీ ఆమె కూడా జాబ్ విషయంలో ఏం చేయలేకపోయారు.
ఒక రోజు అక్క నటిస్తున్న ప్యార్ ఇంపాజిబుల్ మూవీ షూటింగ్ చూసేందుకు యష్ రాజ్ ఫిలిమ్స్ కి వెళ్ళాను. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ నేను జాబ్ ఎందుకు చేయకూడదు అనుకున్నాను. ఆ సంస్థ ప్రతినిధులతో దయ చేసి నాకు ఇక్కడ ఒక జాబ్ ఇవ్వండి అన్నాను. నువ్వు ఓవర్ క్వాలిఫైడ్. నువ్వు చేసే జాబ్స్ ఇక్కడేమీ లేవు అన్నారు. ప్రస్తుతం నాకు జాబ్ లేదు. ఎలాంటి ఉద్యోగమైనా చేస్తాను, అన్నాను. అప్పుడు నాకు ఇంటర్న్ జాబ్ ఇచ్చారు… అని పరిణీతి చోప్రా చెప్పుకొచ్చారు.
అనంతరం నటిగా ప్రయత్నం చేసి ఆమె సక్సెస్ అయ్యారు. 2011లో లేడీస్ వర్సెస్ విక్కీ బాల్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. 2023లో పరిణీతి చోప్రా యంగ్ పొలిటీషియన్ రాఘవ్ చద్దాను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె సినిమాలు చేయడం లేదు.