Solar Eclipse 2024 : సైన్స్ ప్రకారం సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వెళుతున్నప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. సూర్య గ్రహణ సమయంలో సూర్యడు దాదాపు కనిపించకుండా ఉంటారు. ఈ సమయంలో అంతా చీకటిగా మారుతుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి సూర్య గ్రహణం ఏర్పడుతుంది. 2024 సంవత్సరంలో మొత్తం రెండు సూర్య గ్రహణాలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఏప్రిల్ 8న ఏర్పడింది. ఇప్పుడు అక్టోబర్ 2న చివరి సూర్య గ్రహణం ఏర్పడబోతుంది. సూర్యగ్రహణం ఒక్కోసారి ఒక్కో ప్రభావం ఉంటుంది. ఇది జరిగే కక్ష్య ప్రకారం ఆయా ప్రాంతాల్లో సూర్య గ్రహణ ప్రభావం ఉంటుంది. అక్టోబర్ 2న ఏర్పడే సూర్య గ్రహణం ఏ దేశాల్లో ప్రభావం ఉంటుంది? భారతదేశంపై సూర్య గ్రహణ ప్రభావం ఉందా? ఆ వివరాల్లోకి వెళితే..
సూర్య గ్రహణం ను రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు. ఇది యాదృచ్ఛికంగానే జరుగుతుందని సైన్స్ తెలుపుతుంది. అయితే ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం గ్రహణాలు మానవుల జీవితాలపై ప్రభావం చూపుతాయని అంటుంటారు. అందుకే గ్రహణ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ ఉంటారు. కొందరు గ్రహణాన్ని చూడొచ్చని వాదిస్తుండగా.. మరికొందరు గ్రహణ సమయంలో ఇంట్లో నుంచి బయటకు రావొద్దని అంటున్నారు. ముఖ్యంగా గర్భిణులు ఈ సమయంలో కనీసం కదలకుండా ఉండాలని అంటారు. అయితే ఇప్పుడు ఏర్పడే గ్రహణం ఎలాంటి ప్రభావం ఉంటుందంటే?
అక్టోబర్ 2న మహాలయ అమావాస్య సందర్భంగా ఏర్పడే సూర్య గ్రహణం 6 వేల సంవత్సరాల కిందట మహాభారత కాలంలో ఏర్పడిందని, మళ్లీ ఇప్పుడు ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. అందువల్ల ఈ గ్రహణం చాలా శక్తివంతమైనదని అంటున్నారు. ఈరోజున రాత్రి 9.13 గంటలకు ప్రారంభమై.. ఉదయం 3.17 గంటల కు ముగుస్తుంది. దీంతో భారత్ లో ఈ గ్రహణం కనిపించదు. కానీ చిలీ, బ్రెజిల్, అంటార్కిటికా, బ్యూనస్, న్యూజిలాండ్ దేశాల్లో ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయొద్దని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. భారతదేశంలో ఈ గ్రహనం రాత్రి సమయంలో ఉండనుంది. అయినా కొన్ని పాటించాలని అంటున్నారు. గ్రహణ సమయంలో ఎటువంటి పూజలు చేయరాదు. ఈ సమయంలో కొత్తగా ఎటువంటి పనులు మొదలు పెట్టరాదు. కొన్ని పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో వీలైదే ధ్యానం చేయడంతో పాటు కొన్ని ప్రార్థనలు చేయొచ్చు. ఇక ఈ సమయంలో ఆహారం, పానీయాలకు దూరంగా ఉండాలని కొందరు చెబుతున్నారు.
గ్రహణ సమయంలో వాతావరణంలో పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయని, అందువల్ల కొన్నిపనులు చేయద్దని అంటున్నారు. అయితే భారత్ లో రాత్రి సమయంలో ఈ గ్రహణం ఏర్పడుతున్నందున కొన్ని నియమాలపై సందేహం నెలకొంది. అయితే ఆ లోపు ఆహారం తీసుకోవాలని కొందరు చెబుతున్నారు. అయితే గర్భిణులు మాత్రం ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాలని అంటున్నారు. కానీ కొందరు ఇలాంటివి నమ్మద్దని అంటున్నారు. బైనాక్యూలర్ ద్వారా గ్రహణాలను చూడొచ్చని చెబుతున్నారు. కానీ అక్టోబర్ 2న ఏర్పడే సూర్యగ్రహణం భారత్ లో కనిపించదు.