https://oktelugu.com/

Pallavi Prashanth: బిగ్ బాస్ అల్లర్లు… పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అరెస్ట్!

14 రోజుల రిమాండ్ పై జైలుకు వెళ్లిన పల్లవి ప్రశాంత్ కి 48 గంటల్లో బెయిల్ వచ్చింది. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ తమ్ముడు కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

Written By: , Updated On : December 25, 2023 / 11:04 AM IST
Pallavi Prashanth

Pallavi Prashanth

Follow us on

Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు 7 అనూహ్యంగా వివాదాల్లో చిక్కుకుంది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పేరుతో కొందరు యువకులు అల్లర్లకు పాల్పడ్డారు. అమర్ దీప్, గీతూ రాయల్ కార్లపై దాడి చేశారు. అద్దాలు పగలగొట్టారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల మీద రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో ఎలాంటి ర్యాలీ నిర్వహించవద్దని పోలీసులు టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కి సూచించారు. పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చిన పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపించారు.

14 రోజుల రిమాండ్ పై జైలుకు వెళ్లిన పల్లవి ప్రశాంత్ కి 48 గంటల్లో బెయిల్ వచ్చింది. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ తమ్ముడు కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా పోలీసులు అల్లర్లకు పాల్పడిన నిందితులను గురించే పనిలో ఉన్నారు. ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ సరూర్ నగర్ కి చెందిన 20 ఏళ్ల విద్యార్థి హరినాథ్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. అలాగే యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ ఏరియాకు చెందిన 23 ఏళ్ళ సుధాకర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అలాగే పవన్ అనే మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అల్లర్లకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు గుర్తిస్తున్నారు.

ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ తెలుగు 7 వివాదాస్పదం అయ్యింది. ఈ గొడవలతో బిగ్ బాస్ షోతో పాటు హోస్ట్ నాగార్జున పరువు పోయింది. చాలా కాలంగా బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలనే డిమాండ్ ఉంది. ఇది మరింత బలపడింది. వివాదాల నేపథ్యంలో నాగార్జున హోస్టింగ్ బాధ్యతల నుండి తప్పుకుంటారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఓటీటీ బిగ్ బాస్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయట.