Prabhas
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా సలార్ డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. సలార్ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ఆడియన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో డార్లింగ్ ప్రభాస్ సలార్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. బాహుబలి 2 తర్వాత పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చినప్పటికీ .. సరైన హిట్ పడలేదు.
వరుస ప్లాపులతో బాధపడుతున్న ప్రభాస్ కు సలార్ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. కాగా రూ. 450 కోట్ల రూపాయల తో భారీ యాక్షన్ థ్రిల్లర్ లో తెరకెక్కించిన ఈ ఛితంలో కన్నడ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు ముందు టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి సలార్ మూవీ టీమ్ ను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాటు ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొన్నారు.
ఈ క్రమంలో పృద్విరాజ్ .. ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ”ప్రభాస్ చాలా డేంజర్. ఫుడ్ విషయంలో పొరపాటున కూడా ఆయన దగ్గర నోరు జారకూడదు. ఒకసారి నా భార్య, కుమార్తె తో వస్తే గది నిండా వంటకాలతో నింపేసాడు. ప్రభాస్ తో ఉంటే డైట్ పాటించలేం .. ఓ రోజు షూటింగ్ లో కార్లు అంటే ఇష్టమని అన్నాను.
రెబల్ స్టార్ ఏకంగా రూ. 6 కోట్లు విలువ చేసే తన లాంబోర్గినీ కారును తీసుకొచ్చి నాకు ఇచ్చారు. హైదరాబాద్ లో ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ తన కారును వాడుకోమని చెప్పారు. ప్రభాస్ ప్రేమను తట్టుకోలేము. అతన్ని అందరూ డార్లింగ్ అని ఎందుకంటారో ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తెలిసిందని ” పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు.