Planets Change :జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలో మార్పులు రావడంతో కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం ఉంటుంది. మార్చి 15 నుంచి బుధుడు మీన రాశిలో ప్రవేశిస్తాడు. బుధుడు అనగానే చల్లని గ్రహం. దీంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు జరగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి వ్యతిరేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
గ్రహాల కలియకలో భాగంగా బుధుడు మీనరాశిలో ప్రవేశించడంతో వృషభ రాశి వారికి అధిక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశి వారికి వద్దన్నా డబ్బు ఇంట్లోకి వచ్చి చేరుతుంది. వ్యాపారుల పెట్టుబడులకు లాభాలు వస్తాయి. దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టేవారికి ఇది మంచి సమయం. ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు. కర్కాటక రాశివారికి అనేక ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. కొత్త ఆస్తిని కొనుగోలు చేస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. విశ్వసనీయత పెరుగుతుంది.
బుధ గ్రహం మార్పుతో కన్యా రాశివారికి ఉన్నత ప్రయోజనాలు కలుగుతాయి. కెరీర్ గ్రోత్ కు సంబంధించిన అవకాశాలు వస్తాయి. ఉద్యోగులు ప్రమోషన్లు పొందవచ్చు. ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతారు. వృశ్చికం రాశి వారికి ఇన్నాళ్లు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అనుకూల సమయం కొన్ని విషయాల్లో చాకచక్యంగా వ్యవహరిస్తారు. తెలివిని ఉపయోగించి లక్ష్యాలను చేరుకుంటారు.
బుధ గ్రహం మీనరాశిలో ప్రవేశించడం కొన్ని రాశుల వారికి వ్యతిరేక ప్రయోజనాలు కలగనున్నాయి. మిథునం రాశి వారికి ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. సింహా రాశి వారు కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. ఎక్కువగా వాదనలు చేయడం వల్ల నష్టాలనుఎదుర్కొంటారు. ఏదైనా సమస్య ఏర్పడితే దాని పరిష్కారం కోసం ఆలోచించాలే తప్ప పెంచుకోవద్దు. తులా రాశివారికి ఇప్పటి నుంచి వ్యతిరేక పవనాలే వీస్తాయి. ఈ రాశివారికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. స్నేహితులకు దూరమవుతారు. కొన్ని పనుల కోసం తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది.