Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేస్తున్నాడు అంటే అప్పట్లో ప్రేక్షకులకు ఆ సినిమా మీద విపరీతమైన అంచనాలైతే ఉండేవి. ఇప్పటి లాగా అప్పట్లో అంత టెక్నాలజీ లేదు కాబట్టి చిరంజీవి చేసే సినిమాకు సంబంధించిన ఒక చిన్న పోస్టర్ రిలీజ్ అయితే చాలు అభిమానులు ఆ పోస్టర్ ను పేపర్ నుంచి కట్ చేసుకొని ఇంట్లో అతికించుకొని మరి దాన్ని చూస్తూ ఉండిపోయేవారు. అప్పటి జనాలకి చిరంజీవి అంటే అంతటి పిచ్చి అభిమానం ఉండేది.
కాబట్టే చిరంజీవి వాళ్లని ఎప్పుడు నిరాశపరచకుండా వాళ్ళు ఎలాంటి చిరంజీవిని అయితే తెరపైన చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాలనే చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతూ వచ్చాడు. ఇక ఇలాంటి చిరంజీవి కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చేసిన ముఠామేస్త్రి సినిమా సమయంలో అప్పట్లో ఐటెం సాంగ్ డాన్సర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సిల్క్ స్మిత ని కొట్టాడు అనే వార్తలైతే చాలా ఎక్కువగా వినిపించాయి. అయితే దానికి కారణం ఏంటి అనే విషయాలు మనం ఒకసారి తెలుసుకుందాం…
ముఠామేస్త్రి సినిమాలో మొదటి సాంగ్ లో సిల్క్ స్మిత చిరంజీవితో ఆడిపాడింది. అయితే ఈ సాంగ్ షూట్ జరిగే సమయంలో ఆ సినిమా సెట్ కి తాగేసి వచ్చిన సిల్క్ స్మిత అక్కడున్న డైరెక్షన్ టీం తో గాని, రైటర్లతో కానీ గొడవకు దిగిందట..వాళ్లు ఎంత వద్దు అని చెప్పిన కూడా ఆమె తగ్గలేదట.. దాంతో అక్కడున్న ఒక వ్యక్తి చిరంజీవి గారు వచ్చాక మీ సంగతి చెప్తారు అని అనడంతో చిరంజీవికి నా సంగతి చెప్పెంత సీను లేదు అని చిరంజీవి గురించి కూడా మరి ఓవర్ గా మాట్లాడడంతో, చిరంజీవి వచ్చి ఎంత కామ్ గా ఉండమని చెప్పిన కూడా తాను వినకుండా అల్లరల్లరి చేస్తూ సెట్ అంతా పిచ్చిపిచ్చిగా చేయడంతో ఆమెను చిరంజీవి రెండు దెబ్బలు కొట్టి అక్కడి నుంచి పంపించాడట…
దాంతో అప్పట్లో ఈ న్యూస్ మీడియా లో వచ్చింది. అయినప్పటికీ చిరంజీవి కావాలని ఆమెను కొట్టలేదు. ఇక చిరంజీవి అలా చేయకపోతే ఆమె అక్కడ ఇంకా రచ్చ రచ్చ చేసేదట, కెమెరాలను పగలగొట్టడానికి కూడా వెళ్ళింది అంటూ ఆ సెట్లో ఉన్న చాలామంది ఆ తర్వాత వివరణ ఇచ్చారు…