Nari Nari Naduma Murari OTT release date: ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య ఎలాంటి హంగామా లేకుండా విడుదలై, బాక్స్ ఆఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్ గా నిల్చిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. చాలా కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న శర్వానంద్ , ఈ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఇప్పటికీ థియేటర్స్ వద్ద డీసెంట్ స్థాయి రన్ తో ముందుకెళ్తోంది. కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద మరో రెండు నుండి మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబడుతుంది అని అనుకుంటున్న ఈ సమయం లో, ఈ చిత్రం ఓటీటీలోకి ప్రత్యక్షం అవ్వబోతుందం అందరినీ షాక్ కి గురి చేసింది. ఈమధ్య కాలం లో అన్ని సినిమాలు ఓటీటీ లోకి నాలుగు వారాల తర్వాత వచ్చేస్తున్నాయి.
కానీ ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం నాలుగు వారాలు కూడా పూర్తి అవ్వకముందే ఓటీటీ లోకి దర్శనం ఇవ్వనుంది. సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యాక, అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4 న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కాసేపటి క్రితమే జరిగింది. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంత చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. అయితే సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన కొంతమంది థియేటర్స్ లో మంచి రన్ ని సొంతం చేసుకుంటున్న సినిమాని ఎలా అప్పుడే ఓటీటీ లోకి అంత తొందరగా వదులుతారు?.
ఇలా అయితే మీడియం రేంజ్ సినిమాలను జనాలు థియేటర్స్ లో చూసే అలవాటు రాబోయే రోజుల్లో పోతుంది. లక్షణంగా విడుదలైన నాలుగు వారాలకే ఇంట్లో కూర్చొని కుటుంబం మొత్తం సినిమాని చూసే పరిస్థితి ఉన్నప్పుడు , ఇక థియేటర్ కి వెళ్లి సమయాన్ని, డబ్బు ని వెచ్చించడానికి ఎవరు మొగ్గు చూపిస్తారు చెప్పండి ?, సినీ ఇండస్ట్రీ ని నిర్మాతలు నాశనం చేసేస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 4 న ఓటీటీ లోకి రాబోతుండగా, ప్రభాస్ రాజా సాబ్ చిత్రం ఫిబ్రవరి 6 న రాబోతుంది. మిగిలిన మూడు సంక్రాంతి సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తాయో అని ఎదురు చూస్తున్నారు నెటిజెన్స్.