Jai Bhim: తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రోల జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా జై భీమ్. ఈ సినిమా అక్టోబరు 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై.. మంచి టాక్‌తో దూసుకెళ్లిపోతోంది. అయితే, ఇటీవల సినిమాలో మతరపమైన చిహ్నాన్ని కలిగున్న సీన్‌పై ప్రేక్షకుల్లో ఓ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. మేకర్స్ సన్నివేశాన్ని మార్చినప్పటికీ.. క్యాలెండర్ వివాదం మాత్రం మరింత పెద్దదిగా మారింది.

కుల వర్గాలను రెచ్చగొట్టి, అల్లర్లను సృష్టిస్తోన్న జై భీమ్ నిర్మాత, దర్శకుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పీఎంకే మైలాడుతురై జిల్లా కార్యదర్శని పన్నీర్ సెల్వం నేతృత్వంలోని బృందం పోలీసు స్టేషన్‌కు వినతి పత్రం అందించింది. కలం పరంగా అలర్లను రేకెత్తించి.. వన్నీ వన్నియార్ కమ్యూనిటీని అవమానించిన సూర్య తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని అన్నారు. సూర్య మైలాడుతురై జిల్లాకు వచ్చినప్పుడు అతనిపై దాడి చేసిన వారికి పార్టీ తరఫున రూ.లక్ష ఇస్తామని సంచలన ప్రకటన చేశారు.
అయితే, ఓ వైపు బెదురింపులు వస్తున్న సూర్యకు.. మద్దతుగా నిలిస్తూ సోషల్‌మీడియా వేదికగా #WeStandWithSuriy అనే ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్‌గా మారింది. సూర్యకు మద్దతుగా అభిమానులే కాదు, పలువురు సెలబ్రిటీలూ నిలుస్తున్నారు.
కాగా, 1990ల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా జైభీమ్ సినిమా తెరకెక్కించారు. ఎంతో భావోద్వేగభరితంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసును కదిలించింది. ఈ సినిమా చూసిన పలువురు సెలబ్రిటీలు, రాజకీయనాయకులు సూర్యకు అభినందనలు తెలిపారు.