Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ రావడం అంటే… డ్రీం కం ట్రూ అని చెప్పుకోవడం లో అతిశయోక్తి లేదు. బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ ఫార్మ్. ఈ షో లో కి వస్తే తగిన గుర్తింపు కూడా ఉంటుంది. అయితే ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ఒక పరిణామం చోటు చేసుకుంది. ఈ విషయం జరగడం బిగ్ బాస్ సర్వ సాధారణమే. ఎందుకంటే రెండో సీజన్లో నూతన్ నాయుడు, నాలుగో సీజన్లో సింగర్ నోయల్ అనారోగ్యం వలన బిగ్ బాస్ లో నుండి హఠాత్తుగా వైతొలగి పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఐదో సీజన్లో కూడా అంతే జరిగింది.
గిన్నిస్ బుక్ రికార్డ్ లో పేరు సంపాదించుకున్న ప్రముఖ మోడల్ జస్వంత్ పడాల (జెస్సీ) అనారోగ్యం కారణంగా అనూహ్యంగా షో నుండి వెళ్లి పొవాల్సివచ్చింది. “అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని” అంటే ఇదేనేమో. అదృష్టం బాగుండి పదో వారానికి సంబంధించిన నామినేషన్స్ లో జెస్సీ లేదు. కానీ దురదృష్టవ శాత్తు అనారోగ్యం కారణంగా అనుకోకుండా బిగ్ బాస్ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. ఆరు రోజులు సీక్రెట్ రూమ్ లో ఉంచితే… మళ్ళీ తనని బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారేమో అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసాడు జెస్సీ. కానీ, విధి ఆడిన వింత నాటకంలో చివరకి ఒక పావులాగా మిగిలిపోయాడు.
వచ్చిన మొదటి వారమో, రెండో వారానికో జెస్సీ బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ, మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో పది వారాలు ఉండి ఫైటర్ లాగ వెనుతిరిగాడు. బిగ్ బాస్ నుండి మొత్తం పది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం నుండి పదో వారం వరకు సరయు, ఉమాదేవి, లహరి షారి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేతా వర్మ, ఆర్టిస్ట్ ప్రియా, లోబో, విశ్వ, జెస్సీ నిష్క్రమించారు.