KCR vs BJP: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను అస్థిరపరిచే అతి పెద్ద ప్లాన్ కు తెరతీసింది బీజేపీ. ఇందుకు ఇటీవల కేసీఆర్ ను ఎదురించి గెలిచిన ఈటల రాజేందర్ నే పావుగా వాడబోతోందని సమాచారం. కేసీఆర్ చేత వివక్షకు గురై.. అవమానభారంతో బయటకు వచ్చేసి.. అనంతరం ఎదురించి ఢీకొట్టి గెలిచిన ఈటల చర్మిష్మాను సాంతం వాడుకోవాలని బీజేపీ డిసైడ్ అయినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కేసీఆర్ కు షాకిచ్చేలా బీజేపీ వ్యూహాలను రూపొందించినట్టు సమాచారం.

త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే ఈ వ్యూహాన్ని మొదలుపెట్టి అసెంబ్లీ ఎన్నికల నాటికి కొలిక్కి తేవాలని టార్గెట్ పెట్టుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ కు కీలక బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.
తెలంగాణలోని కీలకమైన ప్రజా సమస్యలపై కేసీఆర్ ను నిలదీస్తూ ఈటల ముందుకు పోవడం వెనుక బీజేపీ స్ట్రాటజీ ఉందని అంటున్నారు. త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాకిచ్చేలా ఈ సరికొత్త వ్యూహాన్ని బీజేపీ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
టీఆర్ఎస్ ను దెబ్బకొట్టడానికి ఆ పార్టీలోని అసంతృప్తులు, అసమ్మతివాదులను, ఇతర పార్టీల నేతలను ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహించాలని బీజేపీ డిసైడ్ అయ్యినట్లు సమాచారం. టీఆర్ఎస్ వ్యూహాన్నే వారిపై ప్రయోగించాలని చూస్తున్నారు. టీఆర్ఎస్ లోని అసంతృప్తులందరినీ గుర్తించి వారిని ఈటల రాజేందర్ ద్వారా గూడుపుఠాణి చేయించి కమలం గూటికి తీసుకురావాలనే వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్టు తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి దీన్ని పూర్తి చేసి టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను చావుదెబ్బ తీయాలని యోచిస్తున్నట్టు తెలిసింది.
కడియం నుంచి జోగురామన్న వంటి టీఆర్ఎస్ సీనియర్ల వరకు పదవులు దక్కక చాలామంది అసంతృప్తితో ఉన్నారు. వారంతా ఈటల రాజేందర్ కు సన్నిహితులు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ చేరికల బాధ్యతను ఈటలకే అప్పజెప్పాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలిసింది. టీఆర్ఎస్ నుంచే వచ్చిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని ఈ వ్యూహంలో ఈటలకు తోడుగా భాగస్వామ్యం చేసినట్టు తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ లోని అసంతృప్తులు, అసమ్మతి వాదులను బీజేపీలో చేర్చుకొని ఆ పార్టీని చావుదెబ్బతీయడానికి బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసినట్టు సమాచారం.
నిజానికి తెలంగాణలో బీజేపీకి సరిపడా బలం లేదు. అన్ని నియోజకవర్గాల్లో నేతలు లేరు. కాంగ్రెస్ బలంగా ఉన్న నల్గొండ జిల్లాలో అయితే ఉనికి లేదు. నేతలు లేరు. అందుకే ఇటువంటి చోట్ల టీఆర్ఎస్ నుంచి నేతలను లాగి బలపడాలని డిసైడ్ అయినట్టు సమాచారం.