Homeఎంటర్టైన్మెంట్ప్చ్.. ఇంకా ఎన్నేళ్లు ఈ 'రాజుగారి గది'లో ?

ప్చ్.. ఇంకా ఎన్నేళ్లు ఈ ‘రాజుగారి గది’లో ?

Omkarబుల్లితెర యాంకర్‌ ఓంకార్‌, వెండితెర దర్శకుడిగా మారి తీసిన ‘రాజుగారి గది’ ఏదో పర్వాలేదనే టాక్ తో, బిలౌవ్ ఏవరేజ్ అనిపించుకుంది. ఇక అప్పటి నుండి ఇప్పటివరకు ఓంకార్, ఆ రాజుగారి గదిలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ‘రాజుగారి గది’ 1,2,3 అంటూ పక్కన నెంబర్లు యాడ్ చేస్తూ.. అప్పుడెప్పుడో వచ్చిన ఆ చిన్నపాటి హిట్ ను ఇంకా క్యాష్ చేసుకోవాలని తెగ ఉబలాట పడుతున్నాడు.

అసలు తన తమ్ముడు అశ్విన్‌, హీరోయిన్‌ అవికా గోర్‌ ప్రధాన పాత్రల్లో ‘రాజు గారి గది 3’ సినిమాని తీసి భారీ డిజాస్టర్ ఇచ్చాడు. ఈ సినిమా పై ప్రేక్షకుల విరుచుకుపడ్డారు. ఇది కూడా ఒక సినిమానేనా ? అంటూ రెచ్చిపోయి ఓంకార్ పరువును తీశారు. చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు.. ఓంకార్ మళ్ళీ తన దగ్గర ‘రాజు గారి గది 4’ కథ సిద్ధంగా ఉందంటున్నాడు.

కాగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓంకార్‌ మాట్లాడుతూ.. ‘అవును, బయట వస్తోన్న రూమర్స్ లో నిజం ఉంది. రాజు గారి గది 4’ స్క్రిప్ట్‌ రెడీ అయింది. అయితే, టైటిల్ చూసి మిస్ లీడ్ అవ్వొద్దు. గతంలోని రాజుగారి గది చిత్రాలకు, ఇప్పుడు తీయబోయే చిత్రానికి చాల తేడా ఉంటుంది. అలాగే నేను ఈ కరోనా కాలంలో ఎక్కువగా కథల పై కూర్చున్నాను.

ఆల్ రెడీ, థ్రిల్లర్‌, స్పోర్ట్స్‌, గ్రామీణ నేపథ్యంలో డిఫరెంట్ డిఫరెంట్ కథలు రాసుకున్నాను. త్వరలోనే ఆ కథలకు సూట్ అయ్యే హీరోలను ఒప్పించి, సినిమాని స్టార్ట్ చేస్తాను అంటూ ఓంకార్ కొత్త కబుర్లు చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా రాజుగారి గది ఫ్రాంచైజీలో సినిమాలను ఇప్పట్లో ఓంకార్ ఆపేలా లేడు. నిజానికి ఓంకార్ కెరీర్ లో ఏకైక హిట్ రాజుగారి గది. అందుకే ఆయన పేరు మీదే సినిమా చేయడానికి తాపత్రయపడుతున్నారు. మరి ఇంకా ఎన్నేళ్లు ఈ ‘రాజుగారి గది’లో ?

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Hot vs Cold Shower

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...
Today 28 July 2026 Horoscope

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
Oktelugu Epaper