Olivia Shocking Comments On NTR: ఒలీవియా మోరిస్.. ఆ పేరు త్రిబుల్ ఆర్ నుంచే తెలుగు నాట చాలా ఫేమస్ అయింది. ఇక సినిమాలో ఆమె నటన చూసి అందరూ ఆమెకు ఫ్యాన్స్ అయిపోతున్నారు. త్రిబుల్ ఆర్ లో కొమురం భీమ్ లవర్ పాత్ర అయిన జెన్నీఫర్ కు ఆమె తప్ప మరెవరూ సూట్ కాలేరేమో అనేంతలా ఈ బ్రిటీష్ బ్యూటీ యాక్ట్ చేసి మెప్పించింది.

కాగా ఇప్పుడు త్రిబుల్ ఆర్ సంచలన విజయం సాధించి రికార్డులన్నీ కొల్లగొడుతోంది. ఈ సందర్భంగా మూవీ సక్సెస్ లో భాగంగా ఓ ఎంటర్ టైన్‌మెంట్ పోర్టల్‌కు ఒలీవియా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె చాలా విషయాలను పంచుకుంది. త్రిబుల్ ఆర్ లో ఛాన్స్ కోసం ఓ వీడియో తీసి ఆడిషన్స్‌కు పంపానని.. చాలా రోజుల తర్వాత తనకు ఓకే చెప్పారని వెల్లడించింది.
Also Read: Srividya: బెడ్ రూమ్ సీన్స్ చేసినా సిస్టర్ గానే చూశారు
రాజమౌళి అద్భుతమైన డైరెక్టర్ అని.. పాత్రలను తాను అనుకున్నట్టు మలుచుకోగల దిట్ట అంటూ పొగడ్తలు కురిపించింది. ఎలాంటి సీన్స్ అయినా తెరకెక్కించడంలో రాజమౌళికి సాటిలేరంటూ తెలిపింది. తన కెరీర్ మొదట్లోనే ఇలాంటి పెద్ద సినిమాలో అవకాశం రావడం ఆనందంగా ఉందని చెప్పింది.

రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి సినిమా చూశానని.. మూవీలో కొమురం భీముడో అనే పాటలో తారక్ ను చూస్తే కన్నీళ్లు వచ్చాయంటూ చెప్పింది. తారక్ అద్భుతమైన నటుడని సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ వివరించింది. సెట్ లో ఎంతో సరదాగా ఉండేవాడని, తనకు ఎంతో నచ్చిన వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది.
ఇక రామ్ చరణ్ కూడా తనకు మంచి స్నేహితుడు అయ్యాడంటూ తెలిపింది. ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ తన బాయ్ ఫ్రెండ్‌కు బాగా నచ్చిందని.. ఇంట్లో స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తున్నాడంటూ వివరించింది ఒలీవియా మోరిస్.
Also Read:Bigg Boss: ఆరో వారంలో ‘బిగ్ బాస్’ ట్వీస్ట్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?