CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో విమర్శల జోరు పెరుగుతోంది. జగన్ పై పవన్ కల్యాణ్, చంద్రబాబు విమర్శలు చేస్తుంటే ఆయన వారిద్దరిని టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నర్సరావుపేటలో నిర్వహించిన సభలో విపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్, చంద్రబాబులు దెయ్యాలని అభివర్ణించారు. వారిపై తన అక్కసు వెళ్లగక్కారు. కొద్ది రోజులుగా ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలతో సమాధానం చెప్పేందుకు జగన్ ఈ వేదికను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ కు ప్రధానమంత్రి అక్షింతలు వేసినట్లు వచ్చిన వార్తలను జగన్ ఖండించారు. మీడియా అనవసర విషయాలు ప్రసారం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రం అప్పులు ఎడాపెడా చేస్తుండటంతోనే ప్రధాని జగన్ ను హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీలంకలో వలె ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటే ప్రమాదం పొంచి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. అందుకే దేశం సంక్షోభంలో కూరుకుపోకుండా చేసేందుకే ఇలా నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.
Also Read: Telangana Schools: అలర్ట్.. తెలంగాణలో మళ్లీ మారిన పాఠశాలల టైమింగ్స్..
పవన్ కల్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలబోనివ్వమని ప్రకటించడంతో జగన్ దానిపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సీఎం జగన్ వారి వ్యాఖ్యలకు ఘాటుగానే స్పందించారు. మొత్తం వారిని నిందించేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుందని కితాబిచ్చుకున్నారు. సంక్షేమ పథకాల అమలుతో రాష్ర్ట ప్రగతి ముడిపడి ఉందని అభివర్ణించారు.
భవిష్యత్ లో కూడా తామే అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో తము పనితీరుకు ఓటర్లు సరైన తీర్పు ఇవ్వనున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఎదురే లేదని సూచిస్తున్నారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా తమకు ఎలాంటి భయం లేదన్నారు. మొత్తానికి ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని జగన్ రెచ్చిపోయారు. అధికారం కోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎదుర్కొని విజయం సాధిస్తామని చెబుతున్నారు.
Also Read:CM KCR Paddy Issue: ఉసిగొల్పడమేనా? ఉద్యమించేది ఏమైనా ఉందా కేసీఆర్ సార్..?