OG Pre Release Event Postponed: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మోస్ట్ క్రేజీ చిత్రం ‘ఓజీ'(They Call Him OG) మరో పది రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై అభిమానుల్లో ఉన్న అంచనాలు సాధారణమైనవి కావు, ఎందుకంటే విడుదల అవుతున్న ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి. సినిమా పై ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్, హైప్ ని పెంచేలా చేస్తున్నాయి. నేడు కాసేపటి క్రితమే విడుదలైన ‘గన్స్ & రోజెస్’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతీ కంటెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉండడం తో కేవలం పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అది మేకర్స్ సరిగా సినిమాని ప్రమోట్ చేయడం లేదు అనే.
Also Read: రవి అస్తమించని బ్రిటీష్ రాజ్యంలో పరిస్థితి తలకిందులు ఎందుకైంది?
ఒక ప్లాన్ ప్రకారం వెళ్లడం లేదని ఫ్యాన్స్ చిరాకు పడుతున్నారు. ముందుగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లో చేద్దామని అనుకున్నారు. ఆ తర్వాత ప్లాన్ ని మార్చి విజయవాడ లో చేద్దామని అనుకున్నారు. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుండి ప్రారంభం అవుతాయి కాబట్టి, మేకర్స్ పవన్ కళ్యాణ్ కి అందుబాటులో ఉండేవిధంగా విజయవాడ లో ప్లాన్ చెయ్యాలని అనుకున్నారు. కానీ ఆరోజున వర్షం వచ్చే సూచనలు ఉన్నాయని సమాచారం ఉండడం తో, ఆదివారం రోజున, అనగా ఈ నెల 21 న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చెయ్యాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. అది కూడా ఆంధ్ర ప్రదేశ్ లో కాదు, హైదరాబాద్ లో. అయితే అభిమానులను ఒక సెంటిమెంట్ తెగ భయపెట్టేస్తుంది. అదేమిటంటే రెండు నెలల క్రితమే హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు.
ఆ సినిమా ఫలితం ఏమైందో మన అందరం చూసాము. మళ్లీ అదే ప్రాంతం లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే నెగిటివ్ సెంటిమెంట్ ఎఫెక్ట్ ఎక్కడ ఓజీ చిత్రానికి తగులుతుందో అని భయపడుతున్నారు ఫ్యాన్స్. కానీ సినిమాలో కంటెంట్ ఉండాలి కానీ, ఇలాంటి సిల్లీ సెంటిమెంట్స్ ఆడియన్స్ కి ఏమి అవసరం, వాళ్ళు ఎప్పటి లాగానే మంచి సినిమాని నెత్తిన పెట్టుకొని ఆరాధిస్తారు. ఇప్పటి వరకు ఓజీ మూవీ కంటెంట్ ని చూస్తుంటే ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అనే భయం అభిమానుల్లో కానీ, ప్రేక్షకుల్లో కానీ ఇసుమంత కూడా కలగలేదు. కాబట్టి ఫ్యాన్స్ భయపడాల్సిన పని లేదని అంటున్నారు.