Mirai: రీసెంట్ గా విడుదలైన తేజ సజ్జ(Teja Sajja) మిరాయ్(Mirai Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనాన్ని మనమంతా చూస్తూనే ఉన్నాం. ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెట్టే రేంజ్ గ్రాస్ వసూళ్లను నమోదు చేసుకుంటూ ఈ చిత్రం ముందుకు దూసుకుపోతుంది. ఒక చందమామ లాంటి కథకు అద్భుతమైన విజువల్స్ ఎఫెక్ట్స్ ని జోడించి, హై క్వాలిటీ స్టాండర్డ్స్ తో ఒక సినిమాని తీస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మిరాయ్ చిత్రం ఒక ఉదాహరణ. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 100 కోట్ల మార్కు గ్రాస్ ని ఈ కారణం చేతనే అందుకోబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఒక పాత చిత్రానికి రీమేక్ అని, అందులోని సన్నివేశాలను మక్కీ కి మక్కి ఈ చిత్రం లో దింపేశారని,రీమేక్ రైట్స్ కొనుగోలు చేయకుండా ఫ్రీ మేక్ చేసారని సోషల్ మీడియా లో కొంతమంది అంటున్నారు.
Also Read: రవి అస్తమించని బ్రిటీష్ రాజ్యంలో పరిస్థితి తలకిందులు ఎందుకైంది?
పూర్తి వివరాల్లోకి వెళ్తే 1969 వ సంవత్సరం లో సూపర్ స్టార్ కృష్ణ హీరో గా నటించిన ‘మహాబలుడు’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు మక్కీ కి మక్కీ నే మిరాయ్ మూవీ స్టోరీ అని,ట్విట్టర్ లో మహాబలుడు లోని సన్నివేశాలను పోస్ట్ చేస్తూ కొంతమంది మిరాయ్ తో పోల్చి చూసి కామెంట్స్ చేస్తున్నారు. దీంతో తేజ సజ్జ పై డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని పై సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్స్ పడుతున్నాయి. ఇలా పాత సినిమాలను గుట్టు చప్పుడు కాకుండా దొంగలించి సినిమాలు తీసే అలవాటు ఒక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మాత్రమే ఉంది అనుకున్నాము, నువ్వు కూడా ఆ కోవకి చెందిన వాడివేనా అంటూ సోషల్ మీడియా లో కార్తీక్ ఘట్టమనేని ని నిలదీస్తున్నారు. మరి దీనికి ఆయన నుండి రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది చూడాలి. ముఖ్యంగా తేజ సజ్జ ఇలాంటి గాసిప్స్ కి ఎక్కువ స్పందిస్తూ ఉంటాడు. ఆయన అయినా రియాక్ట్ అవుతాడో లేదో చూడాలి.