London protests : లండన్ నగరం గత వారం(సెప్టెంబర్ 13, 2025) ఒక చారిత్రక నిరసనకు సాక్షిగా నిలిచింది. టామీ రాబిన్సన్ అనే ఫార్–రైట్ నాయకుడు నేతృత్వంలో ‘యునైట్ ది కింగ్డమ్‘ అనే పేరుతో జరిగిన ఈ మార్చ్‌లో 1.10 లక్షల నుంచి 1.50 లక్షల మంది పాల్గొన్నారు. ఇది యూకేలో ఆధునిక చరిత్రలో అతిపెద్ద రైట్–వింగ్ ఈవెంట్‌గా విశ్లేషకులు పేర్కొంటున్నారు. వలసలు, ముఖ్యంగా ముస్లిం శరణార్థులు, చొరబాటుదారులకు వ్యతిరేకంగా, స్థానికుల భవిష్యత్తు, దేశ స్వరూపాన్ని కాపాడాలని లండన్‌వాసులు ఈ పోరాటం చేశారు.
‘వీ వాంట్ అవర్ కంట్రీ బ్యాక్‘ నినాదాలు
నిరసనకారులు గల్ఫ్ దేశాలు, సిరియా, పశ్చిమాసియా, మొరాకో, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చే ముస్లిం వలసలను లక్ష్యంగా చేసుకున్నారు. ‘స్టాప్ ది బోట్స్‘ (పడవలను ఆపండి) అనే నినాదాలతో, చొరబాటు దారులను అరికట్టాలని, ఇప్పటికే వచ్చిన వారిని దేశం బయటకు పంపాలని డిమాండ్ చేశారు. ‘సేవ్ అవర్ చిల్డ్రన్స్‘ (మా పిల్లలను కాపాడండి) అని కేకలు వేస్తూ, స్థానికుల భవిష్యత్తు, దేశ గుర్తింపును కాపాడాలని పిలుపునిచ్చారు. తెల్లవారి పన్నులు ‘దేశం కానివారి‘ కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నారు? మా పై ఎందుకు వివక్ష? ఉద్యోగాలు, భవనాలు, వేతనాలు స్థానికులకు మాత్రమే ఇవ్వాలి. వలస ఏరియాల్లోకి వెళ్లడానికి కూడా అనుమతి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసన యూకేలో ఈ ఏడాది వేసవిలో జరిగిన చిన్న చిన్న మార్చ్‌ల (హోటళ్ల వద్ద శరణార్థులపై) క్లైమాక్స్‌గా మారింది. మెట్రోపాలిటన్ పోలీస్ అంచనాల ప్రకారం, 1.10 లక్షల మంది పాల్గొన్నారు, ఇది ఆర్గనైజర్ల అంచనాలను మించింది. యూనియన్ జాక్, సెయింట్ జార్జ్ ఫ్లాగులతో మార్చ్ చేస్తూ, ‘కీర్ స్టార్మర్ పాలసీలు‘ను విమర్శించారు.
ఫార్–రైట్ నాయకుడి రాజకీయ ఆయుధం
టామీ రాబిన్సన్ (స్టీఫెన్ యాక్సీ్ల–లెన్నన్) ఈ నిరసనకు పిలుపు ఇచ్చిన ముఖ్య వ్యక్తి. పార్లమెంటు సభ్యుడు కానీ, ఇంగ్లిష్ డిఫెన్స్ లీగ్ (ఈడీఎల్) స్థాపకుడైన ఆయన, ఫార్–రైట్ గ్రూప్‌లకు ప్రసిద్ధి. ఆయనను ‘పిచ్చిగా మాట్లాడతాడు‘ అని విమర్శకులు అంటారు, కానీ అతని మాటలు ముస్లిం వలసలపై భయాన్ని రేకెత్తిస్తాయి. రాబిన్సన్ ఈ మార్చ్‌ను ‘బ్రిటన్‌లో అతిపెద్ద ఫ్రీ స్పీచ్ ఫెస్టివల్‘గా ప్రచారం చేశారు, ఇది రేసిస్ట్ కాన్సి్పరసీలు, యాంటీ–ముస్లిం హేట్ స్పీచ్‌తో నిండింది. ఆయన ప్రసంగంలో, ‘ఇది సాంస్కృతిక విప్లవం‘ అని చెప్పారు,పాలసీలు మారాలని డిమాండ్ చేశారు రెఫార్మ్ ్ఖఓ పార్టీ వంటి మెయిన్‌స్ట్రీమ్ గ్రూప్‌లు ఆయనకు దూరంగా ఉన్నప్పటికీ, ఆయన మాటలు పబ్లిక్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.
ఎలాన్ మస్క్ – ఇతరుల మద్దతు..
నిరసన సమయంలో పోలీసులపై బాటిల్స్, ప్రాజెక్టైల్స్ విసిరేందుకు, రయట్ కంట్రోల్ ఉపయోగించారు. మెట్రోపాలిటన్ పోలీస్ 1,600 మంది అధికారులను మొబైలైజ్ చేసింది, కానీ ఘర్షణలు తప్పలేదు. ‘స్టాండ్ అప్ టు రేసిజం‘ కౌంటర్–ప్రొటెస్ట్‌లో 5 వేల మంది పాల్గొన్నారు, కానీ వారిని వేరుచేయడానికి పోలీసులు కష్టపడ్డారు. ఇక ఈ నిరసనకు అంతర్జాతీయ మద్దతు లభించింది. ఎలాన్ మస్క్ వీడియో లింక్ ద్వారా చేరుకుని, ‘వయలెన్స్ ఇస్ కమింగ్… ఫైట్ బ్యాక్ ఆర్ డై‘ అని చెప్పారు. ‘యూకేకు రెవల్యూషనరీ గవర్నమెంట్ చేంజ్ అవసరం‘ అంటూ, పార్లమెంట్ డిస్సాల్యూషన్ కోరారు. ఫ్రెంచ్ ఫార్–రైట్ నాయకుడు ఎరిక్ జెమ్మూర్ కూడా మద్దతు తెలిపారు, ‘గ్రేట్ రీప్లేస్‌మెంట్‘ థియరీని ప్రచారం చేశారు. మస్క్ వ్యాఖ్యలు యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌ను విమర్శించాయి, ‘టూ–టియర్ పోలీసింగ్‘ అని. బిజినెస్ సెక్రటరీ పీటర్ కైల్ దీన్ని ‘అనుచితమైనది‘ అని విమర్శించారు.
యూరప్ వ్యాప్త ముస్లిం వలస వ్యతిరేక నిరసనలు..
ఈ నిరసన యూరప్‌లో వలసల వ్యతిరేక ఉద్యమానికి మలుపు తిరిగింది. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీలో ఇలాంటి మార్చ్‌లు పెరుగుతున్నాయి, ఫార్–రైట్ పార్టీలు బలపడుతున్నాయి. యూరప్‌లో ముస్లిం జనాభా పెరుగుదల (షరియా చట్టాల భయం) నేరాలు పెరగడం వలసల విధానాలను ప్రశ్నించుతున్నాయి. యూకేలో ఈ ఈవెంట్ ‘అతిపెద్ద యాంటీ–ఇమిగ్రేషన్ ర్యాలీ‘గా చెప్పబడుతోంది, ఇది పాలకులకు హెచ్చరిక. కౌంటర్–ప్రొటెస్ట్‌లలో డయాన్ ఆబ్బట్ వంటి నాయకులు ‘రేసిస్ట్ మిథ్స్‘ను విమర్శించారు. ఈ నిరసనలు యూరప్‌లో జనాభా సమతుల్యతను కాపాడాలని, వలసలను అరికట్టాలని ఒత్తిడి చేస్తున్నాయి.