Mirai OTT: తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్'(Mirai Movie) భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ టాక్ కి తగ్గట్టే వసూళ్లు కూడా భారీ రేంజ్ లో వచ్చాయి. ఇంతటి రేంజ్ రెస్పాన్స్ వస్తుందని బహుశా మేకర్స్ కూడా ఊహించి ఉండరు. భారీ వీకెండ్ తర్వాత ఏ సినిమా అయినా వర్కింగ్ డే రోజు భారీ డ్రాప్స్ ని సొంతం చేసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం. మిరాయ్ కూడా అలా డ్రాప్ అవుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. నేడు కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. A సెంటర్స్ లో అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయి కానీ, క్రింది సెంటర్స్ లో మాత్రం కాస్త తగ్గింది అనే అనుకోవాలి.
Also Read: రవి అస్తమించని బ్రిటీష్ రాజ్యంలో పరిస్థితి తలకిందులు ఎందుకైంది?
ప్రస్తుతానికి బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 7 నుండి 8 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. చూస్తుంటే రేపటి లోపు ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ మార్కుని కూడా అందుకునేలా అనిపిస్తుంది. కేవలం స్టార్ హీరోలకు మాత్రమే వారం రోజుల లోపు ఇలా వంద కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చేవి. కానీ మొట్టమొదటి సారి ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకు వస్తుంది. ఫుల్ రన్ లో హనుమాన్ మూవీ కలెక్షన్స్ ని దాటుతుందో లేదో చెప్పలేము కానీ, ప్రస్తుతానికి 200 కోట్ల గ్రాస్ కి దగ్గరగా వెళ్ళేలాగా అనిపిస్తుంది. ఇక పోతే ఈ సినిమాకు సంబందించిన ఓటీటీ డిజిటల్ రైట్స్ ని జియో హాట్ స్టార్ సంస్థ మంచి ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది. హిందీ లో నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ లో సినిమా విడుదల అవ్వాలంటే కచ్చితంగా ఓటీటీ విండో కనీసం 8 వారాలు ఉండాలి.
కాబట్టి ఈ సినిమా హిందీ వెర్షన్ జియో హాట్ స్టార్ లో విడుదల అయ్యేది 8 వారాల తర్వాతే. కానీ తెలుగు మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో మాత్రం ఈ చిత్రం నాలుగు వారాల తర్వాత జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. అంటే వచ్చే నెల 14 వ తేదీన ఈ చిత్రాన్ని మనం జియో హాట్ స్టార్ లో చూడొచ్చు అన్నమాట. అయితే ఇప్పటి వరకు తేజ సజ్జ సినిమాలు మెయిన్ ఓటీటీ సంస్థలు అయినటువంటి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లు కొనుగోలు చేయలేదు. అందుకు కారణాలు ఏమిటో తెలియవు కానీ, మిరాయ్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యుంటే ఫారిన్ దేశాలకు సంబంధించిన ఆడియన్స్ కూడా ఎగబడి చూసేవారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ చెప్తున్నారు.