OG Movie: పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా వెర్రిక్కిపోయి ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ఓజీ. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని చూసినా, ఆ సినిమా పేరు విన్నా అభిమానుల ఒంట్లో వెయ్యి వోల్టుల కరెంటు పాస్ అవుతుంది. ఆ స్థాయి క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న చిత్రమిది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ అప్పట్లో ‘జానీ’, ‘జల్సా’ సినిమాల కోసం ఎలా అయితే వెర్రిక్కిపోయి ఎదురు చూసేవారో, ఓజీ చిత్రం కోసం అంతలా ఎదురు చూస్తున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ చిత్రం గత ఏడాది సెప్టెంబర్ 27న విడుదల అయ్యేది. కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమా వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక సినిమా షూటింగ్ మొదలు పెడుతాడు అనుకుంటే, ఇప్పటి వరకు ఆయన సెట్స్ లోకి రాలేదు.
ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ కి ఉండే సన్నివేశాలు మొత్తం పూర్తి అయ్యాయి కానీ, సెకండ్ హాఫ్ మాత్రం పూర్తి అయ్యింది. ఆయన లేని సన్నివేశాలకు సంబంధించిన షాట్స్ మొత్తం తీసేసారు. వాటికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి అయ్యాయి. కేవలం పవన్ కళ్యాణ్ సన్నివేశాలు మాత్రమే బ్యాలన్స్. ఈ ఫిబ్రవరి లో ఆయన డేట్స్ ఎప్పుడు ఇస్తాడు అనే దానిపై క్లారిటీ రానుంది. మార్చి నెలాఖరు లోపు షూటింగ్స్ ని పూర్తి చేసి, మే నెలలో సినిమాని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అదేంటి ‘హరి హర వీరమల్లు’ చిత్రం మార్చి 28న విడుదల అవుతుంది కదా, రెండు నెలల్లో మరో పవన్ కళ్యాణ్ సినిమా రాబోతోందా అని మీరు అనుకోవచ్చు. కానీ ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాలు లేవని ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.
కారణం ‘హరి హర వీరమల్లు’ కి సంబంధించి VFX వర్క్ ఇంకా 50 శాతం కి పైగా బ్యాలన్స్ ఉందట. విదేశాల్లో ఈ వర్క్ ని చేయిస్తున్నారు. వాళ్ళు చేసిన VFX లో కొన్ని కరెక్షన్స్ ఉండడంతో మళ్ళీ రీ వర్క్ చేయిస్తున్నారు. ఇలా ఎక్కువ సమయం తీసుకుంటుంది ఆ చిత్రం. బెటర్ క్వాలిటీ, హై స్టాండర్డ్స్ లో VFX కంటెంట్ ఉండాలంటే కచ్చితంగా సమయం కావాలి. కాబట్టి ఈ చిత్రమే ముందుగా విడుదల అవ్వబోతుందని టాక్. అంతే కాకుండా నిర్మాత దీవీవీ దానయ్య ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ని అన్ని ప్రాంతాల్లో అమ్మేశాడు. రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. బయ్యర్స్ తొందరగా విడుదల తేదీని ప్రకటించాల్సిందిగా నిర్మాతపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో మేకర్స్ పవన్ కళ్యాణ్ అనుమతిని తీసుకొని విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 26 న మహాశివ రాత్రిని పురస్కరించుకొని ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.