Pawan Kalyan : కూటమి ప్రభుత్వం లో అద్భుతంగా పరిపాలిస్తున్న మంత్రి ఎవరు అని అడిగితే సామాన్య ప్రజల నుండి ఏకపక్షంగా ముక్తకంఠంతో వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన రోజు నుండి పవన్ కళ్యాణ్ లో భయం, భాద్యత రెండు పెరిగాయి. జనాలు మాకు ఇంతటి అద్భుతమైన విజయాన్ని అందించారు. వాళ్ళ నమ్మకాలను ఒమ్ము చేయకుండా, చాలా జాగ్రత్తగా పని చేస్తున్నాడు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13 వేల గ్రామాల్లో ‘గ్రామ సభలు’ నిర్వహించి,ఆ సభల్లో తీర్మానించిన సమస్యలను ‘పల్లె పండుగ’ పేరుతో యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తూ ముందుకు బుల్లెట్ లాగా దూసుకుపోతున్నాడు. దీంతో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రోడ్డు, మంచి నీరు, విద్యుత్తు సౌకర్యం లేని గ్రామాలూ కూడా నేడు అభివృద్ధిని చూస్తున్నాయి. దీనివల్ల జనాల్లో పవన్ కళ్యాణ్ పేరు, క్రేజ్ వేరే లెవెల్ కి చేరిపోయింది.
డిప్యూటీ సీఎం గా ఉంటేనే ఇన్ని చేస్తున్నాడంటే, ఇక సీఎం అయ్యాక ఎన్ని చేస్తాడో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన మరో అద్భుతమైన కార్యక్రమాన్ని అధికారుల చేత పూర్తి చేయించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లాలోని, ఆర్ల పంచాయితీలో నీలబంధ అనే గ్రామం ఉంది. ఈ గ్రామం లో మూడు కుటుంబాలు, 26 మంది నివసిస్తున్నారు. గత 77 ఏళ్ళ నుండి ఈ గ్రామానికి విద్యుత్తు సరఫరా లేదు. చీకట్లోనే ఇన్నేళ్లు తమ జీవితాలను సాగనిచ్చారు. ‘గ్రామ సభలు’ కార్యక్రమం లో ఈ విషయాన్నీ పంచాయితీ రాజ్ శాఖ దృష్టికి తీసుకొని రాగా, అధికారులు వెంటనే గుర్తించి ఆ గ్రామానికి విద్యుత్తు అందేలా చేసాడు. దీంతో ఆ గ్రామస్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ధింసా నృత్యం చేస్తూ హర్షం వ్యక్తం చేసారు.
ఇలా ఒక్కటా రెండా చెప్పుకుంటే పోతే ఈ ఆరు నెలల కాలం లో పవన్ కళ్యాణ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆయన ఇంకా ఏ రేంజ్ లో సుపరిపాలన అందిస్తాడో, ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే తర్వాత మీడియా కి కనిపించకపోవడంతో అభిమానులు కాస్త కంగారుకి గురి అవుతున్నారు. ప్రతీ రోజు ఎదో ఒక యాక్టీవిటీ తో పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీ గా ఉండడం, దానికి సంబంధించిన ఫోటోలు కానీ, వీడియోలు కానీ సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం వంటివి జరుగుతుండేవి. కానీ గత పది రోజులుగా అలాంటివేమీ జరగడం లేదు. దీంతో అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు, ఏమి చేస్తున్నాడు?, అసలు ఇండియా లో ఉన్నాడా లేడా?, ఢిల్లీ ఎన్నికల ప్రచారాలకు రావాల్సిందిగా బీజేపీ అధిష్టానం కోరినప్పటికీ కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ రాలేదు వంటి ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల్లో తలెత్తుతున్నాయి.