Tirupati : ప్రతిపక్షంలో ఉంటే ఒకలా విమర్శలు చేస్తారు.. తీరా అధికారంలోకి వస్తే ఇంకోలా ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఏపీలో కూటమి అదే చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసిపి హయాంలో వ్యవస్థలన్నీ ధ్వంసం అయ్యాయని తరచూ కూటమి నేతలు ఆరోపిస్తుంటారు. గతంలో వైసిపి హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దౌర్జన్యాలు జరిగాయని అప్పట్లో చంద్రబాబుతో పాటు పవన్ ఆరోపించారు. అటు తర్వాత వచ్చిన ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలను బహిష్కరించారు కూడా. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. 8 నెలల కిందట కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు నాటి మాటలను గుర్తు చేసుకోకుండా కూటమి అదేవిధంగా దిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈరోజు మున్సిపాలిటీ, నగరపాలక సంస్థలకు సంబంధించి ఉప ఎన్నికలు జరిగాయి. కానీ అడుగడుగునా కూటమి తన అధికార దర్పాన్ని ప్రదర్శించింది. అప్పట్లో వైసిపి అలా వ్యవహరించింది అని ఆరోపణలు చేసింది తామే అన్న విషయాన్ని మరిచిపోయింది తెలుగుదేశం పార్టీ.
తిరుపతిలో కూటమి పార్టీలు రచ్చ చేశాయి. వైసీపీకి చెందిన మహిళా కార్పొరేటర్ల విషయంలో జనసేన ఎమ్మెల్యే కుమారుడు అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 8 మంది కార్పొరేటర్ లను కొట్టి లాక్కెళ్ళినట్లు వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. అందులో నలుగురిని మాత్రమే విడిచి పెట్టారని.. మిగిలిన ఆ నలుగురు ఏమయ్యారో కూడా తెలియడం లేదని.. ఏపీలో ఆటవిక పాలన రాజ్యమేలుతోందని ఆరోపిస్తోంది వైసిపి. అటు వ్యవస్థలు సైతం నిర్వీర్యం అయ్యాయని ఆందోళన చెందుతోంది.
మరో 10 నెలల కాలానికి మున్సిపల్, కార్పొరేషన్లలో వివిధ కారణాలతో ఖాళీ అయిన మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ల స్థానాలకు ఈరోజు 3 ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. అయితే మొత్తం 10 చోట్ల ఎన్నికలకు నిర్ణయించగా.. ఈరోజు ఏడు చోట్ల మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఏడు చోట్ల టిడిపి కూటమి స్పష్టమైన హవా కనబరిచింది. తిరుపతిలో మాత్రం విధ్వంసం చోటుచేసుకుంది. అటు ప్రత్యర్థులకు రక్షణ కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. మారింది అధికారమే తప్ప.. విధానాలు కాదని అభిప్రాయం అంతటా వ్యక్తం అవుతోంది.
గత ఐదేళ్ల పాలనలో అనేక రకాల విధ్వంసాలు జరిగాయని టిడిపి కూటమి ఆరోపిస్తూ వచ్చింది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో చాలా రకాల ఎన్నికలు జరిగాయి. కానీ ప్రజాస్వామ్య యుతంగా జరగలేదని నాడు తెలుగుదేశంతో పాటు జనసేన ఆరోపించింది. కానీ కేవలం ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల వ్యవహరించిన తీరు మాత్రం ఆందోళన కలిగిస్తోంది. వచ్చే ఏడాది వరుసగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం కూటమి పార్టీల తీరు చూస్తుంటే.. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో అర్థమవుతోంది. సోషల్ మీడియా వేదికగా దీనిపై అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ తీరుపై ముప్పేట విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మహిళా కార్పొరేటర్ల పై దాడికి ప్రయత్నించిన తిరుపతి జనసేన ఎమ్మెల్యే కొడుకు
తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు మధన్ రౌడీయిజం
డిప్యూటీ మేయర్ ఎన్నిక ముంగిట.. చిత్తూరు భాస్కర్ హోటల్లో ఉన్న వైయస్ఆర్సీపీ మహిళా కార్పొరేటర్ల పై దాడికి ప్రయత్నించిన ఆరణి మధన్… pic.twitter.com/jXz0wSi9jU
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2025