‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఓ రాజకీయ నేపథ్యంలో సాగే కేజిఎఫ్ రేంజ్ భారీ యాక్షన్ సినిమా తీయాలనుకున్నారట. కానీ, దానికి హీరో ఎన్టీఆర్ నో అన్నారని ఈ మేరకు ఓ గ్యాసిప్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది ఇంకా క్లారటీ లేదు. అయితే, త్రివిక్రమ్ సన్నిహితుల దగ్గర నుండి అందుతున్న సమాచారం ప్రకారం పక్కా రాజకీయాల పై త్రివిక్రమ్ సినిమా తీయబోతున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే చాల రకాలుగా రూమర్స్ కూడా వచ్చాయి.
Also Read: మెగాస్టార్ చిరుకు సోనూ సూద్ చిరుకానుక
ఈ చిత్రం కోసం ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారని.. రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా సినిమాలో ప్రస్తావించబోతున్నట్లు ఆ మధ్య బాగా వినిపించింది. పైగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను కూడా రాసాడట. ఇక ఎన్టీఆర్ ది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అట, అలాగే నేటి రాజకీయాలకి ఓ కొత్త ఒరవడిని పరిచయం చేసేలా ఎన్టీఆర్ పాత్రను త్రివిక్రమ్ రాస్తున్నాడట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.
Also Read: సామ్ జామ్ లో ఎమోషనలైన బన్నీ!
అలాగే ఈ సినిమాలో మరో కథానాయికగా తన గత రెండు సినిమాల్లో నటించిన పూజా హెగ్డేను తీసుకోవాలనే యోచనలో ఉన్నాడు త్రివిక్రమ్. మరి పూజా హెగ్డే ఫైనల్ అవుతుందో లేదో తెలియాలంటే కొంత వెయిట్ చేయాలి. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని మార్చి నుండి షూటింగ్ మొదలుపెట్టి దసరాకి సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పైగా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాని రిలీజ్ చేయనున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్