https://oktelugu.com/

భారీ క్రేజీ కాంబినేషన్ కి ముహూర్తం ఫిక్స్ !

అర్జున్‌ రెడ్డి అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లో ఓ ట్రెండ్ ను సెట్ చేసి.. అదే బోల్డ్ సినిమాని హిందీలో కూడా చేసి.. రెండు ప్రధాన భాషల్లో తనకంటూ సొంత మార్కెట్ తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సందీప్ వంగ. ఒక్క సినిమాతో నేషనల్ డైరెక్టర్ రేంజ్ గుర్తింపు తెచ్చుకోవడం అంటే బహుశా ఈ మధ్య కాలంలో సందీప్ కే దక్కిన క్రెడిట్ అనుకుంటా అది. నిజానికి హిందీలో ‘కబీర్ సింగ్’ లాంటి సినిమాలు చాలా వచ్చాయి. […]

Written By:
  • admin
  • , Updated On : December 31, 2020 / 09:55 AM IST
    Follow us on


    అర్జున్‌ రెడ్డి అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లో ఓ ట్రెండ్ ను సెట్ చేసి.. అదే బోల్డ్ సినిమాని హిందీలో కూడా చేసి.. రెండు ప్రధాన భాషల్లో తనకంటూ సొంత మార్కెట్ తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సందీప్ వంగ. ఒక్క సినిమాతో నేషనల్ డైరెక్టర్ రేంజ్ గుర్తింపు తెచ్చుకోవడం అంటే బహుశా ఈ మధ్య కాలంలో సందీప్ కే దక్కిన క్రెడిట్ అనుకుంటా అది. నిజానికి హిందీలో ‘కబీర్ సింగ్’ లాంటి సినిమాలు చాలా వచ్చాయి. అయినా ఈ రీమేక్ సినిమా అక్కడ భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం ఏమిటి. పైగా కబీర్ సింగ్ అనే పేరు ఇప్పుడు బాలీవుడ్ లో ఒక ఇంట్రస్టింగ్ ట్రేండింగ్ నేమ్ అవ్వడం కూడా నిజంగా విశేషమే.

    Also Read: నన్ను తన ఫ్రెండ్స్ తో పడుకోమన్నాడు – కరిష్మా కపూర్

    అన్నింటికి మించి కబీర్ సింగ్ బాలీవుడ్ స్టార్ల సినిమాల్లో బోల్డ్ కంటెంట్ కు నాంది పలికిన సినిమాగా కూడా క్రెడిట్ కొట్టేసింది. అందుకే సందీప్ రెడ్డి వంగాకి బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ క్రియేట్ అయింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన కొత్త సినిమా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‏తో చేయబోతున్నాడు. తాజాగా కబీర్ సింగ్ నిర్మాత తన ట్వీట్టర్ లో పోస్ట్ చేస్తూ.. న్యూఇయర్ కానుకగా జనవరి 1 మధ్యాహ్నం 12 గంటలకు డైరెక్టర్ సందీప్ రెడ్డి మరియు హీరో రణబీర్ కపూర్ కాంబినేషన్‏లో రాబోతున్న కొత్త సినిమా అప్ డేట్ రివీల్ అవ్వబోతుంది అంటూ పోస్ట్ చేశారు.

    Also Read: సామ్ జామ్ లో ఎమోషనలైన బన్నీ!

    కాగా సందీప్ రెడ్డి కొత్త సినిమాకి నిర్మాతలు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి రెడీగా ఉన్నారట. ‘కబీర్ సింగ్’ ఇచ్చిన నమ్మకమే అందుకు కారణమని నిర్మాత చెబుతున్నారు. జనవరి అనంతరం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాని నిర్మాత టీ-సిరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతాని కలిసి భారీ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని.. అలాగే హీరోయిన్ గా ఆలియా భట్ నటిస్తోందని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాకి సందీప్ సోదరుడు, ‘అర్జున్ రెడ్డి’ నిర్మాత ప్రణయ్ వంగ కూడా చిత్ర నిర్మాణంలో పాలుపంచుబోతున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్