
వచ్చే నెల 9వ తేదీన తన వివాహం జరగనున్నదని ప్రముఖ గాయని సునీత వెల్లడించారు. నేడు ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కొత్త జీవితం బాగుండాలని శ్రీవారిని ప్రార్ధించానని వెల్లడించారు. కరోనా కారణంగా గత తొమ్మిది నెలలుగా శ్రీవారి దర్శనానికి దూరమయ్యానని పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని గాయని సునీత తెలిపారు. ఇప్పటికే ఓ వివాహం చేసుకుని భర్త నుంచి విడాకులు తీసుకున్న సునీత.. డిజిటల్ మీడియా ప్రముఖుడు రామ్ వీరపనేనిని వివాహం చేసుకోబోతున్నారు.