Pradeep Ranganathan: ప్రస్తుతం స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ రేట్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో నందమూరి ఫ్యాన్స్ ని డీలా పడేలా చేశాడు. ఇక ఆ తర్వాత తనని తాను అప్డేట్ చేసుకొని ‘టెంపర్’ చిత్రం చేశాడు. అప్పటి నుండి ‘దేవర’ చిత్రం వరకు వరుసగా 7 బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు. అసలు ఎన్టీఆర్ కి ఇక ఫ్లాప్ అనేదే రాదా అని ఆయన దురాభిమానుల సైతం అసూయ పడేలా, అభిమానులను గర్వంతో కాలర్ ఎగరేసుకునేలా చేశాడు. ఇకపోతే ప్రస్తుతం ‘వార్ 2 ‘ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న ఆయన, ఈ చిత్రం తర్వాత కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్థం లో మొదలు కానున్న ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పెట్టినట్టు ఇన్ని రోజులు సోషల్ మీడియా లో ప్రచారం అయ్యింది.
ఇదే టైటిల్ ఫిక్స్ అని అనుకున్నారు కూడా. కానీ ఇంతలోపే ‘లవ్ టుడే’ మూవీ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ టైటిల్ ని లాగేసుకున్నాడు. నేడు ఆయన కొత్త సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేశాడు. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాకి అస్వత్ మారి ముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పెట్టారు. అంతటి పవర్ ఫుల్ టైటిల్ ని కాలేజీ బ్యాక్ డ్రాప్ సినిమా కోసం పెట్టావా..?, మా టైటిల్ ని దోచేశావు కదా అని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా లో ప్రదీప్ పై మండిపడుతున్నారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమాలకు ఎన్నో టైటిల్స్ ఉంటాయి, ఇలాంటివి అవసరం లేదు, మా టైటిల్ మాకు వెనక్కి ఇచ్చేయ్ అంటూ డిమాండ్ చేస్తున్నారు.
మరి ప్రదీప్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ కి రెస్పాన్స్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం 2026 సంక్రాంతిని టార్గెట్ చేసుకొని తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో ‘సప్త సాగరాలు ఎల్లో’ చిత్రం ఫేమ్ రుక్మిణి వాసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాకుండా ఈ చిత్రం లో కమల్ హాసన్, లేదా రజినీకాంత్ వంటి స్టార్ హీరోలు ముఖ్య పాత్రలు పోషించే అవకాశం కూడా ఉంది. గత ఏడాది పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుండి మొదలు కానుంది. రాబోయే రెండు నెలల్లో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రానున్నాయి. సుమారుగా 500 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారు. చూడాలి మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విస్ఫోటనం సృష్టిస్తుంది అనేది.