https://oktelugu.com/

Kalki 2 : ‘కల్కి 2’ స్టోరీ కేవలం ఆ ఇద్దరి చుట్టే తిరుగుతుందా..? ప్రభాస్ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశే!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన 'కల్కి' చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : January 16, 2025 / 05:28 PM IST

    Kalki 2

    Follow us on

    Kalki 2 : రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘కల్కి’ చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సీక్వెల్ క్రేజ్ తో కాకుండా, స్టాండ్ ఎలోన్ సినిమాల క్యాటగిరీలో సౌత్ నుండి వెయ్యి కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరిన ఏకైక సినిమా ఇదే. ఈ చిత్రం సీక్వెల్ కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే కల్కి చిత్రం అంత పెద్ద విజయం సాధించినప్పటికీ ప్రభాస్ అభిమానుల్లో ఎక్కడో తెలియని ఒక నిరాశ ఏర్పడింది. కారణం ప్రభాస్ మార్క్ హీరోయిజం మిస్ అవ్వడం, ఆయనకంటే అమితాబ్ బచ్చన్ క్యారక్టర్ పవర్ ఫుల్ గా ఉండడమే. సెకండ్ పార్ట్ లో అయినా మొత్తం ప్రభాస్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని అనుకున్నారు ఫ్యాన్స్.

    ప్రభాస్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది అనేది నిజమే, కానీ ఆయన పాత్రతో సమానంగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాత్రల చుట్టూ కూడా ఈ సినిమా కథ తిరుగుతుందని ఆ చిత్ర నిర్మాత అశ్వినీ దత్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు. ‘కల్కి’ చిత్రం క్లైమాక్స్ లో ప్రభాస్ మహాభారతం లోని కర్ణుడి పునర్జన్మ ఎత్తినట్టు చూపించారు. అశ్వథామ చేతిలో ఉన్న కర్ర, భారతంలో కర్ణుడు తన విల్లు గా ఉపయోగించి శత్రువులను చీల్చి చెండాడేవాడు. ఈ కర్ర మళ్ళీ అతని చేతిలోకి వెళ్ళినప్పుడే పవర్ ఫుల్ గా మారుద్ది అని, అప్పటి వరకు ఇది కేవలం ముసలోడి చేతి కర్ర మాత్రమేనని అంటాడు. ఆయన చెప్పినట్టుగానే ప్రభాస్ చేతిలోకి ఈ కర్ర రాగానే కర్ణుడు ఆయన శరీరంలోకి పూనుతాడు. కంప్లెక్స్ నుండి వచ్చిన విలన్స్ ని లేపేసి దీపికా పదుకొనే ని రక్షిస్తాడు.

    ఆ తర్వాత మళ్ళీ తన వాస్తవ రూపంలోకి వచ్చి దీపికా పదుకొనే ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాడు. అశ్వర్థామ కి ఎవరో ఆ క్షణంలోనే తెలుస్తాది. మిత్రమా నేను చెప్పేది విను అని ప్రభాస్ ని ఆపే ప్రయత్నం చేసి విఫలం అవుతాడు. పార్ట్ 2 ఇక్కడి నుండే మొదలు అవ్వుధి. ప్రభాస్ కోసం ఫస్ట్ హాఫ్ మొత్తం అమితాబ్ బచ్చన్ వెతుకుతూ ఉంటాడు. మరో పక్క సుప్రీమ్ యాస్కిన్(కమల్ హాసన్) దీపికా కడుపులో పెరుగుతున్న కల్కి ని చంపేందుకు భూమి మీదకు వచ్చి ఆమె కోసం వెతుకుతాడు. ప్రభాస్ కి సెకండ్ హాఫ్ లో తానూ ఎవరు అనే వాస్తవ రూపాన్ని తెలియచేసి, సుప్రీమ్ యాస్కిన్ తో కలిసి పోరాడేలా చేస్తాడు అశ్వథామ. అలా ఈ ఇద్దరు కలిసి సుప్రీమ్ యాస్కిన్ తో భీకరమైన పోరు చేస్తారు. చివరికి గెలిచారా లేదా అనేదే స్టోరీ. ‘కల్కి 2 ‘ కేవలం ప్రభాస్ స్టోరీ మాత్రమే కాదు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లకు కూడా సరిసమానమైన ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ప్రభాస్ మార్క్ యాక్షన్ ఎలివేషన్స్ ఈ సినిమాకి అభిమానులు ఆశించకూడదు.