Homeఎంటర్టైన్మెంట్Prabhas: రెండేళ్లలో ప్రభాస్ 4 సినిమాలు రిలీజ్ కు రెడీ...అన్నీ హై వోల్టేజ్ సినిమాలే...ఏవేవో తెలుసా...

Prabhas: రెండేళ్లలో ప్రభాస్ 4 సినిమాలు రిలీజ్ కు రెడీ…అన్నీ హై వోల్టేజ్ సినిమాలే…ఏవేవో తెలుసా…

Prabhas: ప్రభాస్ సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకు పండగే. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ పాన్ ఇండియా అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తారు. గత సంవత్సరం వరకు ఏమో కానీ ఈ సంవత్సరం మాత్రం ప్రభాస్ అభిమానులకు డబల్ ఎంటర్టైన్మెంట్ పక్క అని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ అరడజన్ సినిమాలతో బిజీగా ఉన్నారు అని సమాచారం. ఒకదానికి మించి ఒకటి ఇంట్రెస్టింగ్ స్టోరీ తో ఈ సినిమాలు తెరకెక్కుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. రాజా సాబ్, కల్కి2, హను రాఘవపూడి సినిమా, స్పిరిట్, సలార్ 2 సినిమాలు ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్నాయి. ఇటీవల నిర్మాత అశ్విని దత్ కల్కి 2 రిలీజ్ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ నాగస్విన్ కాంబినేషన్లో వచ్చిన కల్కి సినిమాకు సీక్వెల్ గా కల్కి 2 రాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతవరకు షూటింగ్ జరిగిందని సమాచారం. ఇక త్వరలోనే ఈ సినిమా యూనిట్ పూర్తిస్థాయిలో షూటింగ్ స్టార్ట్ చేసి సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇప్పటికే ఈ సినిమా నిర్మాత తెలిపారు. దీంతో రాబోయే రెండేళ్లలో డార్లింగ్ వి నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వడం గ్యారెంటీ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2025- 2026 లో ప్రభాస్ నాలుగు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే తాజాగా రాజా సాబ్ సినిమా నుంచి సంక్రాంతి కానుకగా పోస్టర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ పోస్టర్లో ఏ సినిమాలో లేనంత హ్యాండ్సమ్ గా ప్రభాస్ కనిపించడంతో రాజా సాబ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఏప్రిల్ 10న రాజా సాబ్ రిలీజ్ అవుతుంది అని సినిమా యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ప్రభాస సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పుడే పండుగా అంటూ ట్రిక్కి పోస్టు పెట్టింది సినిమా యూనిట్. దీంతో అనుకున్న డేట్ కి రాకపోయినా కూడా ఈ సంవత్సరమే రాజా సాబ్ సినిమా రిలీజ్ అవుతుంది అన్నది గ్యారెంటీ అంటున్నారు. రాజా సాబ్ సినిమా ఈ సంవత్సరం రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ మూవీ తర్వాత అంతే స్పీడ్ గా హను రాఘవపూడి కాంబినేషన్లో పౌజి అనే వర్కింగ్ టైటిల్ లో ప్రభాస్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతుందని అలాగే ఈ సినిమాలో ప్రభాస్ మునుపెన్నడు కనిపించని లుక్ లో కనిపించబోతున్నారని, అలాగే ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాను ఈ సంవత్సరం చివరలో గాని లేదా వచ్చే ఏడాది ఫస్ట్ ఆఫ్ లో గాని రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ ప్రయత్నిస్తున్నారు. ఇక ఆల్రెడీ ప్రభాస్, ప్రశాంత్ నీళ్ కాంబినేషన్లో వచ్చిన సలార్ సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సలార్ 2 నెక్స్ట్ లెవెల్ మేకింగ్ తో రాబోతుందని ఒక లేటెస్ట్ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా కూడా వచ్చే సంవత్సరం రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దాంతో ప్రభాస్ ఈ రెండేళ్లలో నాలుగు సినిమాల రిలీజ్ టార్గెట్గా బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version