https://oktelugu.com/

NTR And Naga Chaitanya: కొండ సురేఖ చేసిన కామెంట్లకి ఘాటుగా రెస్పాండ్ అయిన ఎన్టీయార్, నాగ చైతన్య…

సినిమా ఇండస్ట్రీలో మంచైనా, చెడైనా చాలా తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే సినిమాకు సంబంధించిన విషయాలను తెలుస్కోవడం లో జనాలు కూడా చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే హీరోల మీద కామెంట్లు చేసి దాని ద్వారా పాపులారిటి ని సంపాదించుకున్న వాళ్లు కూడా ఉన్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 3, 2024 / 08:37 AM IST

    NTR And Naga Chaitanya

    Follow us on

    NTR And Naga Chaitanya: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంత ఇద్దరూ కలిసి చాలా రోజులపాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక వాళ్ళ వివాహ బంధం ఎక్కువ రోజుల పాటు కొనసాగలేదు. దాంతో ఇద్దరూ విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ ను వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఇక ఇదంతా జరిగి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ వీళ్లు విడాకులు ఎందుకు తీసుకున్నారు. అనేదాని మీద సరైన క్లారిటీ అయితే లేదు. కానీ రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ అయిన కొండ సురేఖ గారు వీళ్ళ విడాకుల మీద కొన్ని కామెంట్లైతే చేశారు. సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం కేటీఆర్ గారే అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇక ఆమె కేటీఆర్ గురించి మాట్లాడుతూనే నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టకుండా ఉండడానికి కేటీఆర్ సమంతని తన దగ్గరికి పంపమన్నాడని నాగార్జున, నాగ చైతన్య సమంతని ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళమని ఫోర్స్ చేసినప్పటికీ తను వెళ్లలేదని అందువల్లే నాగచైతన్య సమంతకి విడాకులు ఇచ్చాడని ఆమె వాళ్ల మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలైతే చేశారు.
    ఇక ప్రస్తుతానికి ఈ విషయం మీద అటు సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు గానీ, ఇటు రాజకీయ నేతలు గాని కొండ సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ పలు రకాల కామెంట్లు అయితే చేస్తున్నారు. ఇక రీసెంట్ గా నాగచైతన్య కూడా ఈ వివాదం మీద స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ అయితే చేశాడు. అదేంటంటే విడాకులు అనేది వల్ల పర్సనల్ మేటర్ అని ఒకరికొకరు ఇద్దరు విడిపోవాలనుకునే సందర్భం వచ్చినప్పుడు ఇద్దరు విడిపోయి చాలా సంతోషంగా ఉంటున్నారని రాసుకొచ్చాడు. ఇక అలాగే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ విడాకులకు కారణం ఏంటి అని అడుగుతున్నప్పటికీ ఇప్పుడు కొండా సురేఖ గారు గౌరవ మంత్రి పదవిలో ఉండి అలాంటి కామెంట్లు చేయడం సరైన విషయం కాదు.

    ఏదో ఒక న్యూస్ క్రియేట్ చేసి చెప్పడం అనేది సరైన విషయం కాదు. నిజానికి విడాకులు అనేది చాలా సెన్సిటివ్ మేటర్ దాని వెనకాల ఇద్దరు జీవితాలు, రెండు కుటుంబాలు చాలా వరకు సఫర్ అవుతూ ఉంటారు. అలాగే లేడీ మినిస్టర్ అయినా కొండా సురేఖ ఇలాంటి షెమ్ ఫుల్ కామెంట్లు చేయడం నిజంగా మా అందరినీ బాధిస్తుంది. ఇక అలాగే ఈ మ్యాటర్ ని చూపించడానికి మీడియా కూడా చూపిస్తున్న ఉత్సాహాన్ని చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది అంటూ నాగ చైతన్య ఒక పోస్ట్ అయితే చేశాడు…

    ఇక ఇదే విషయం మీద యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ అసలు సెలబ్రెటీల మీద కొన్ని గాసిప్స్ అనేవి చాలామంది క్రియేట్ చేసి చెప్తూ ఉంటారు. కానీ మంత్రి పదవి లో ఉన్న కొండ సురేఖ గారు ఇలాంటి కామెంట్స్ చేయడం బాధాకరం.ఆమెకి ఉన్న హోదకి ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది సరైన విషయం కాదు. ఎందుకంటే సినిమాకు సంబంధించిన హీరో హీరోయిన్లు సెలబ్రిటీ హోదాలో ఉంటారు. కాబట్టి వాళ్ల మీద గాసిప్స్ రావడం కామన్ కానీ ఒక మంత్రి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధను కలిగిస్తుంది. సెలబ్రిటీస్ కి కూడా ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది.వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళని అలా ఉండనివ్వండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…