https://oktelugu.com/

Bigg Boss Telugu 8: అదిరిపోయే పాయింట్స్ తో యష్మీ పై విరుచుకుపడ్డ పృథ్వీ..తారాస్థాయికి చేరిన గొడవ..చివరికి ఏమైందంటే!

గొడవ జరిగిన కాసేపటికే మళ్ళీ ఒక్కటి అయిపోయారు. ఒకరిని ఒకరు గట్టిగా కౌగలించుకున్నారు. పాపం పృథ్వీ మొట్టమొదటిసారి బాగా ఏడ్చేశాడు కూడా. అసలు ఏమి జరిగిందంటే 'సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్' గేమ్ లో అత్యధిక టాస్కులు గెలిచినందుకు గానూ శక్తి క్లాన్ కి బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ ఇస్తాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 3, 2024 / 08:32 AM IST

    Bigg Boss Telugu 8(68)

    Follow us on

    Bigg Boss Telugu 8: సోనియా బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిపోయిన తర్వాత యష్మీ మరియు పృథ్వీ బాగా క్లోజ్ అవుతారని అందరూ ఊహించారు. అనుకున్నదే జరిగింది. ఆమె ఎలిమినేట్ అయిన వెంటనే యష్మీ, నిఖిల్, పృథ్వీ ఒక జట్టు అయిపోయారు. వీళ్ళ ముగ్గురు మధ్య రిలేషన్ కూడా చాలా బాగుంది. ఆ రిలేషన్ వీళ్ళ ఆట చెడిపోయేందుకు ఎలాంటి ప్రభావం చూపడం లేదు. అంతా బాగానే ఉంది కానీ నేడు వీళ్లిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. గొడవ జరిగిన కాసేపటికే మళ్ళీ ఒక్కటి అయిపోయారు. ఒకరిని ఒకరు గట్టిగా కౌగలించుకున్నారు. పాపం పృథ్వీ మొట్టమొదటిసారి బాగా ఏడ్చేశాడు కూడా. అసలు ఏమి జరిగిందంటే ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’ గేమ్ లో అత్యధిక టాస్కులు గెలిచినందుకు గానూ శక్తి క్లాన్ కి బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ ఇస్తాడు.

    ఆ పవర్ ఏమిటంటే మీలో మీరు మాట్లాడుకొని ఎవరు చీఫ్ కంటెండర్ అవ్వాలని అనుకుంటున్నారో బిగ్ బాస్ కి చెప్పండి, వాళ్ళు ఎలాంటి టాస్కులు ఆడకుండా చీఫ్ కంటెండర్ అయ్యేందుకు అర్హత సంపాదిస్తారు అని అంటాడు. ఆ తర్వాత నిఖిల్, పృథ్వీ, యష్మీ, ఆదిత్య ఎవరు చీఫ్ అవ్వాలి అనే దానిపై చర్చించుకుంటారు. నిఖిల్ చాలా సింపుల్ గా నేను ఇప్పటికే చీఫ్ అయ్యాను, యష్మీ కూడా చీఫ్ అయ్యింది. పృథ్వీ, ఆదిత్య లో ఎవరో ఒకరు చీఫ్ అయితే బాగుంటుంది అని నా అభిప్రాయం అని చెప్తాడు. ఆ తర్వాత ఆదిత్య ఓం నాకు కూడా చీఫ్ అవ్వాలని ఉంది, ఎందుకంటే ఈ హౌస్ లో చాలా మంది నా నాయకత్వ లక్షణాలపై కామెంట్స్ చేసారు, నన్ను నేను నిరూపించుకోవాలి అని అంటాడు. ఇక ఆ తర్వాత చివరికి యష్మీ, పృథ్వీ మధ్య చర్చ నడుస్తుంది. యష్మీ ముందుగా మాట్లాడుతూ ‘నేను మళ్ళీ చీఫ్ అవ్వాలని అనుకుంటున్నాను, గతంలో ఫన్ వే లో వెళ్లి చీఫ్ గా కొన్ని తప్పులు చేశాను, వాటిని ఇప్పుడు సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాను’ అని అంటుంది. అప్పుడు పృథ్వీ ‘నేను కూడా ఎన్నో రోజుల నుండి కష్టపడి ఆడుతున్నాను, నాకు కూడా చీఫ్ అవ్వాలని ఉంది’ అని అంటాడు.

    దీనికి యష్మీ మాట్లాడుతూ ‘నువ్వు చీఫ్ అయితే రేషన్ సరిగా తీసుకొస్తావని నాకు నమ్మకం లేదు, నీకు వంట చేయడం కూడా రాదు’ అని అంటుంది. అప్పుడు పృథ్వీ ‘నాలో నెగటివ్స్ మాత్రమే ఎందుకు చెప్తావు, పాజిటివ్స్ చెప్పొచ్చు కదా?, ఆ మాటకు వస్తే నువ్వేమి ఆడావు, చిన్న చిన్న టాస్కులు కూడా ఆడలేకపోయావు, నీకు నువ్వే చీఫ్ గా ఫెయిల్ అయ్యాను అని ఒప్పుకున్నావు కదా’ అని పృథ్వీ వాదిస్తాడు. అలా వాళ్ళిద్దరి మధ్య మాటలు పెరగడంతో పృథ్వీ కి కోపం వచ్చి మధ్యలోనే లేచి వెళ్ళిపోతాడు. యష్మీ ఏడ్చేస్తుంది, నిఖిల్ పృథ్వీ వద్దకు వెళ్లి అతన్ని కూల్ చేసి యష్మీ దగ్గరకు వెళ్ళమంటాడు. అప్పుడు పృథ్వీ యష్మీ వద్దకు వచ్చి బాగా ఎమోషనల్ అవుతాడు. చివరికి యష్మీ కూడా పృథ్వీ చీఫ్ అయ్యేందుకు ఒప్పుకుంటుంది.