Amala Akkineni: ‘మనిషావా.. రాక్షసివా..నువ్వు ఎలా మినిస్టర్ అయ్యావు’ అంటూ మంత్రి కొండా సురేఖ పై విరుచుకుపడ్డ అక్కినేని అమల!

అక్కినేని నాగార్జున తో పాటు, సమంత కూడా చాలా తీవ్ర స్థాయిలో ఖండిస్తూ కొండా సురేఖ వ్యాఖ్యలను ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా ఖండించారు. కాసేపటి క్రితమే నాగార్జున సతీమణి అక్కినేని అమల కూడా దీనిపై చాలా ఘాటుగా రెస్పాన్స్ ఇచ్చింది.

Written By: Vicky, Updated On : October 3, 2024 8:42 am

Amala Akkineni

Follow us on

Amala Akkineni: తెలంగాణ రాష్ట్ర పర్యావరణం, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ నేడు నాగ చైతన్య సమంత విడాకుల వ్యవహారం గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. సెలబ్రిటీస్ అందరూ ఒక్కొక్కరిగా స్పందిస్తూ కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. N కన్వెన్షన్ హాల్ ని కూల్చొద్దు అంటూ నాగార్జున కేటీఆర్ ని రిక్వెస్ట్ చేసాడని, అందుకు సమంత ని తన వద్దకు పంపాలని కేటీఆర్ కోరాడని, నాగార్జున సమంత ని ఒప్పించే కేటీఆర్ వద్దకు పంపే ప్రయత్నం చేయగా ఆమె ఒప్పుకోకపోవడంతో విడాకులు ఇప్పించాడని ఇలా అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేసింది. దీనిపై అక్కినేని నాగార్జున తో పాటు, సమంత కూడా చాలా తీవ్ర స్థాయిలో ఖండిస్తూ కొండా సురేఖ వ్యాఖ్యలను ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా ఖండించారు. కాసేపటి క్రితమే నాగార్జున సతీమణి అక్కినేని అమల కూడా దీనిపై చాలా ఘాటుగా రెస్పాన్స్ ఇచ్చింది.

ఆమె మాట్లాడుతూ ‘ఒక లేడీ మినిస్టర్ రాక్షసి లాగ మారి, రాక్షస పూరితమైన అసత్యాలను అమాయకపు ప్రజల మీద రుద్దాలని చూడడం అమానుషం. మినిస్టర్ మేడం గారు, మీ బుర్రలో ఉన్న దరిద్రమైన ఆలోచనలను ఆరోపణలుగా మార్చి నా భర్త మీద రుద్దాలని చూస్తే జనాలు నమ్ముతారు అనుకుంటున్నారా?, వాళ్లకు నిజం ఏది, అబద్దం ఏది అనేది తెలియదు అనుకుంటున్నారా?. ప్రజలను పాలించే స్థాయిలో ఉన్న లీడర్స్ ఇలాంటి క్రిమినల్ ఆలోచనలతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతారా?, ఇలాంటి వారి పాలనలో మన దేశం ఎటు వైపు వెళ్తుంది?, మిస్టర్ రాహుల్ గాంధీ గారు, మీరు నిజంగా మానవతా విలువలను నమ్మితే, మీ నాయకత్వం లో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళను సరిచేసుకోండి, సామాన్య ప్రజలను ఇలాంటి వాళ్ళ నుండి కాపాడండి’ అంటూ అక్కినేని అమల వ్యాఖ్యానించింది.

ఇన్నేళ్ల సినీ కెరీర్ లో అమల ఈ స్థాయిలో విరుచుపడడం అభిమానులు ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ నవ్వుతూ శాంతంగా కనిపించే అమల లో ఇంత కోపం కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. కొండా సురేఖ చేసిన కామెంట్స్ అలాగే ఉన్నాయి మరి. అంత నీచంగా ప్రజా క్షేత్రం లో ఉన్న ఏ నాయకుడు కానీ, నాయకురాలు కానీ మాట్లాడలేడు. కొండా సురేఖ గత ఎన్నికలలో ఎంతో కష్టపడి గెలిచింది. జనాలు కచ్చితంగా ఆమె ఎదో మంచి చేస్తారు అని నమ్మి ఓటు వేశారు. రాజ్యాంగ పదవి లో కూర్చొని కూడా ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు ఒక స్త్రీ అయ్యుండి, పర స్త్రీ పై ఎలా చేసిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. దీనిని కాంగ్రెస్ పార్టీ నాయకులు, సోషల్ మీడియా లో ఉండే కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా సామర్దించడం లేదు. రేవంత్ రెడ్డి కొండా సురేఖ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజెన్స్. మరి సీఎం రేవంత్ నుండి ఇప్పటి వరకు ఆమె వ్యాఖ్యలపై ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.