https://oktelugu.com/

జ‌బ‌ర్ద‌స్త్ ఆర్టిస్టుకు ఎన్టీఆర్ దండం.. వైర‌ల్ అవుతున్న వీడియో!

‘జ‌బ‌ర్ద‌స్త్’ ప్రోగ్రాంలో హైపర్ ఆది టీమ్ కు ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో అంద‌రికీ తెలిసిందే. ఆది పంచ్ డైలాగుల‌కు, రైజింగ్ రాజు యాక్టింగ్ కు తోడైతే న‌వ్వుల తుఫాను మొద‌లైన‌ట్టే! ఈ టీం తాజాగా జ‌బ‌ర్ద‌స్త్ వేదిక మీద కాకుండా.. మ‌రో చోట పెర్ఫామ్ చేసింది. ఈ కార్య‌క్ర‌మానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా జ‌బ‌ర్ద‌స్త్ టీం కు దండం పెట్టాడు ఎన్టీఆర్‌. ప్ర‌స్తుతం ఈ వీడియో ఫుల్ వైర‌ల్ […]

Written By:
  • Rocky
  • , Updated On : February 18, 2021 / 11:25 AM IST
    Follow us on


    ‘జ‌బ‌ర్ద‌స్త్’ ప్రోగ్రాంలో హైపర్ ఆది టీమ్ కు ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో అంద‌రికీ తెలిసిందే. ఆది పంచ్ డైలాగుల‌కు, రైజింగ్ రాజు యాక్టింగ్ కు తోడైతే న‌వ్వుల తుఫాను మొద‌లైన‌ట్టే! ఈ టీం తాజాగా జ‌బ‌ర్ద‌స్త్ వేదిక మీద కాకుండా.. మ‌రో చోట పెర్ఫామ్ చేసింది. ఈ కార్య‌క్ర‌మానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా జ‌బ‌ర్ద‌స్త్ టీం కు దండం పెట్టాడు ఎన్టీఆర్‌. ప్ర‌స్తుతం ఈ వీడియో ఫుల్ వైర‌ల్ అవుతోంది.

    Also Read: సక్సెస్ మీట్: ఉప్పెన టాలీవుడ్ కు ఊపు తెచ్చిందన్న రాంచరణ్

    రాజ‌ధానిలోని సైబరాబాద్ పోలీసు విభాగం గ‌త వారం రోజులుగా జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వ‌హిస్తోంది. తాజాగా ముగింపు కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. ఈ కార్యక్రమంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌బ‌ర్ద‌స్త్ టీం ఈ వేదిక‌పై ఓ స్కిట్ ప్ర‌ద‌ర్శించింది.

    మద్యం సేవించి వాహనం నడపకూడదని, రోడ్డు ప్రమాదాలను నివారించాల‌నే కథాంశంతో చిన్న నాటికను ప్రదర్శించారు. ఈ స్కిట్ లో హైపర్ ఆది త‌న‌దైన‌ పంచులతో మరోసారి రెచ్చిపోయాడు. ఈ స్కిట్ లో ఆదితోపాటు రైజింగ్ రాజు, శాంతి స్వరూప్, పరదేశి నాయుడు, సాయి తదితరులు న‌టించారు. హైపర్ ఆది డైలాగ్స్‌కు విశేష స్పందన లభించింది.

    Also Read: పవన్ కళ్యాణ్ ఇలా మారిపోయారేంటి?

    అనంతరం రోడ్డు భ‌ద్ర‌త‌పై ఎన్టీఆర్ భావోద్వేగ‌మైన ప్ర‌సంగం చేశారు. ఆ త‌ర్వాత హైపర్ ఆది బృందానికి ఎన్టీఆర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బహుమతులు అందించారు. స్కిట్ లో న‌టించిన వారందరినీ శాలువాతో సత్కరించి, మెమొంటోలు అందజేశారు.

    ఈ సంద‌ర్భంగా జబర్దస్త్ కమెడియన్ రైజింగ్ రాజు జూనియర్ ఎన్టీఆర్ కాళ్లపై పడి నమస్కరించాడు. ఎన్టీఆర్ వెంటనే రాజును పైకి లేపాడు. పెద్ద వాళ్లు అలా కాళ్లు మొక్క కూడదని చెబుతూ.. తిరిగి రైజింగ్ రాజుకు దండం పెట్టారు. ఈ ఘ‌ట‌న ద్వారా తోటి క‌ళాకారుల ప‌ట్ల ఎన్టీఆర్ ఎలా ఉంటారో మ‌రోసారి నిరూపిత‌మైంది. అంతేకాదు.. పెద్ద‌ల ప‌ట్ల ఎన్టీఆర్ విధేయత కూడా మ‌రోసారి చర్చనీయాంశమైంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్