నిరుద్యోగులకు శుభవార్త.. ఐటీఐ అర్హతతో నావీలో ఉద్యోగాలు..?

ఇండియన్ నావీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 1,159 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 1,159 ఉద్యోగ ఖాళీలలో విశాఖ నావీలోనే 710 ఉద్యోగ ఖాళీలు ఉండటం గమనార్హం. https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. భారీవేతనంతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు..? ఫిబ్రవరి 22వ […]

Written By: Navya, Updated On : February 18, 2021 11:33 am
Follow us on

ఇండియన్ నావీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 1,159 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 1,159 ఉద్యోగ ఖాళీలలో విశాఖ నావీలోనే 710 ఉద్యోగ ఖాళీలు ఉండటం గమనార్హం. https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. భారీవేతనంతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు..?

ఫిబ్రవరి 22వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా 2021 సంవత్సరం మార్చి 7 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం విశాఖపట్నంతో పాటు కొచ్చి, ముంబైలలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

Also Read: బీటెక్ పాసైన వాళ్లకు శుభవార్త.. భారీ వేతనంతో బెల్ లో ఉద్యోగాలు..?

ముంబై హెడ్‌క్వార్టర్స్ వెస్టర్న్ నావల్ కమాండ్ లో 324 ఖాళీలు ఉండగా కొచ్చి హెడ్‌క్వార్టర్స్ సదరన్ నావల్ కమాండ్ లో 125 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి పాసై ఐటీఐ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 205 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ నేవీ ఆన్ లైన్ పరీక్ష తేదీలను త్వరలోనే వెల్లడించనుందని సమాచారం. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫోటో, సంతకంతో పాటు, సర్టిఫికెట్ల సాఫ్ట్ కాపీలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.