Prabhas Fans: మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..యూత్ మరియు మాస్ లో ఆయనకీ ఉన్న క్రేజ్ ని చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే..బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత ఆయన చేసిన సాహూ మరియు రాధే శ్యామ్ సినిమాలు అభిమానులను అంతగా అలరించలేకపోయ్యాయి..ముఖ్యంగా రాధే శ్యామ్ సినిమా అయితే ఇండియన్ సినీ ఇండస్ట్రీ హిస్టరీ లోనే అతి పెద్ద నష్టాలను మిగిలించిన సినిమాగా రికార్డ్స్ కి ఎక్కింది..రాధే శ్యామ్ ఫలితం చూసిన తర్వాత ప్రభాస్ లాంటి యాక్షన్ హీరో ని జనాలు లవ్ స్టోరీస్ లో ఇక చూడలేరు అనేది అర్థం చేసుకోవచ్చు..ఇక నుండి ప్రభాస్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అట..అభిమానులు మరియు ప్రేక్షకులు తన నుండి ఎలాంటి సినిమాలు కోరుకుంటారో అలాంటి సినిమాలే ఉండేటట్టు ఆయన తన లైనప్ ని సిద్ధం చేసుకున్నట్టు ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్త.
ప్రభాస్ ప్రస్తుతం KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ అనే సినిమా లో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తో పాటుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆది పురుష్ మరియు ప్రాజెక్ట్ K వంటి సినిమాలలో కూడా నటిస్తున్నాడు..ఈ సినిమాలు మాత్రమే కాకుండా ఆయన యంగ్ డైరెక్టర్ మారుతీ తో ఒక్క కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాని కూడా ఓకే చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చాలా రోజుల నుండి వినిపిస్తున్న వార్త..ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి అయినా తర్వాత ప్రభాస్ ఒక్క 9 యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన సినిమాలను తన లైనప్ లో పెట్టుకున్నాడు అట..ప్రభాస్ ని ప్రేక్షకులు మరియు అభిమానులు ఇలాంటి సినిమాలే ఆశిస్తారు.స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సాహూ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ బాక్స్ ఆఫీస్ రెవిన్యూ పరంగా కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిలిచింది..ప్రభాస్ యాక్షన్ మూవీ కి ఉన్న పవర్ అలాంటిది..ఇప్పుడు ఆయన తన లైనప్ లో వరుసగా అలాంటి సినిమాలే చెయ్యబోతుండడం తో అభిమానులు ఆనందం తో కంటతడి పెట్టుకుంటున్నారు.
Also Read: Dil Raju: తన మొదటి భార్య అనితతో దిల్ రాజుకు ఆ విషయంలో గొడవలు జరిగేవి !
ప్రస్తుతం ఆయన KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్ మూవీ పై అభిమానుల్లో మాములు స్థాయి అంచనాలు లేవు..KGF లో హీరో ని ప్రశాంత్ నీల్ చూపించిన విధానానికి అభిమానులు ఫ్లాట్ అయ్యిపోయారు..సినిమాలో హీరో యాష్ కి పడిన ఎలివేషన్స్ లో తమ హీరో ప్రభాస్ ని ఊహించుకొని మురిసిపోయారు..అభిమానుల్లో ఉన్న ఉత్సాహం ని సరిగ్గా కాష్ చేసుకునేట్టు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తీర్చి దిద్దారు అట..ప్రభాస్ ని ఇంతకు ముందు ఏ డైరెక్టర్ కూడా చూపించనంత పవర్ ఫుల్ గా ఈ సినిమాలో ప్రభాస్ ని చూపించబోతున్నారు అట ప్రశాంత్ నీల్..మంచి వాళ్లకి అండగా నిలబడే లీడర్ గా..చెడ్డ వాళ్లకి ఈ ప్రపంచం లోనే తనలాంటి బాడ్ పర్సన్ ఎవ్వరు ఉండరు అనే విధంగా ప్రభాస్ క్యారక్టర్ ని ప్రశాంత్ నీల్ తీర్చిదిద్దిన తీరు చూస్తే అభిమానులు వెర్రెక్కిపోతారు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..వింటుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి కదూ!!..మరి వెండితెర మీద చూస్తే ఏమైపోతారో.
Also Read: KGF 2 Dialogue On Wedding Card: శుభలేఖ పై కూడా ‘కేజిఎఫ్ 2’ డైలాగే.. పిచ్చెక్కించారుగా !
Recommended Videos: