Super Star Mahesh Babu: మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఆచార్య సినిమా ఎట్టకేలకు ఈ నెల 29 వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా కోసం మెగా అభిమానులు దాదాపుగా మూడేళ్ళ నుండి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా టీజర్ , పాటలు మరియు ట్రైలర్ కి అభిమానులు మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఈ నెల 23 వ తారీఖున హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఘనంగా నిర్వహించబోతున్నారు..ఈ ఈవెంట్ కి ఎవ్వరు ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నారు అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు..అందుతున్న కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధి గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది..దర్శక ధీరుడు రాజమౌళి కూడా మరో అతిధి గా హాజరు కాబోతున్నారు అట.

ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పుడు మరో ప్రత్యేకత అదనంగా తోడు అయ్యింది..సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు అట..సినిమా ప్రారంభం లో సినిమా కథ జరిగే పాదఘట్టం అనే కల్పిత గ్రామం గురించి పరిచయం చేస్తూ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఉంటుంది అట..మహేష్ బాబు కి ఇలా తన తోటి హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదేమి కొత్త కాదు..గతం లో ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన జల్సా సినిమాకి..అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన బాద్ షా సినిమాకి వాయిస్ ఓవర్లు అందించాడు..ఆ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలుగా నిలిచాయి..ఈ సెంటిమెంట్ ఆచార్య కి కూడా కలిసి వస్తుంది..ఆ రెండు సినిమాలు లాగానే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించి తీరుతుంది అని అభిమానులు గట్టిగ నమ్ముతున్నారు..మరి చూడాలి ఈ అంచనాలను ఆచార్య సినిమా అందుకుంటుందా లేదా అని.
Also Read: KGF 2 Dialogue On Wedding Card: శుభలేఖ పై కూడా ‘కేజిఎఫ్ 2’ డైలాగే.. పిచ్చెక్కించారుగా !
ఇక ఆచార్య సినిమా విశేషాల్లోకి వెళ్తే ఇందులో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించగా..రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే నటించింది అట..ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే ఈ సినిమా సెకండ్ హాఫ్ మెగాస్టార్ చిరాంకీవి కెరీర్ లోనే బెస్ట్ గా నిలవబోతుంది అట..మెగాస్టార్ కెరీర్ లోనే బెస్ట్ సెకండ్ హాఫ్ అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు..సినిమా రన్ టైం కూడా కేవలం రెండు గంటల 20 నిముషాలు మాత్రమే ఉండేట్టు ఎడిట్ చేయించారు అట డైరెక్టర్ కొరటాల శివ..సెకండ్ హాఫ్ లో చిరంజీవి మరియు రామ్ చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు అభిమానులకు కనులపండుగల ఉండబోతుంది అట..ఇప్పటికే వీళ్లిద్దరు కలిసి చేసిన పాటని ఇటీవలే యూట్యూబ్ లో విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఇక థియేటర్స్ లో పాత వచ్చినప్పుడు అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి
Also Read: YS Vijayamma: తల్లిని సాగనంపిన జగన్.. పొమ్మనలేక పొగబెట్టారా?
Recommended Videos:


