https://oktelugu.com/

Game Changer Movie : ‘గేమ్ చేంజర్’ చిత్రానికి తెలంగాణాలో అవన్నీ బంద్..అభిమానుల ఉత్సాహానికి కళ్లెం వేసిన ప్రభుత్వం!

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కడి ప్రభుత్వం కూడా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చింది. టికెట్ రేట్స్ తో పాటుగా బెనిఫిట్ షోస్ కూడా ఉంటాయట. కానీ కొన్ని కఠినమైన ఆంక్షలు విధించినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఆంక్షలు ఏమిటో ఒకసారి చూద్దాము.

Written By:
  • Vicky
  • , Updated On : January 7, 2025 / 08:37 PM IST

    Game Changer Movie 

    Follow us on

    Game Changer Movie :  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. విడుదలకు ఇంత తక్కువ సమయం ఉన్నప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తి స్థాయిలో ప్రారంభం అవ్వకపోవడంతో అభిమానులు ఇంకెప్పుడు బుకింగ్స్ ప్రారంభిస్తారు అంటూ సోషల్ మీడియా లో మేకర్స్ ని ట్యాగ్ చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే ఈ చిత్రానికి టికెట్ రేట్స్ పెంచారు, బెనిఫిట్ షోస్ కి కూడా అనుమతిని ఇచ్చారు. కానీ తెలంగాణ లో మాత్రం ఇంకా అనుమతి రాలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కడి ప్రభుత్వం కూడా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చింది. టికెట్ రేట్స్ తో పాటుగా బెనిఫిట్ షోస్ కూడా ఉంటాయట. కానీ కొన్ని కఠినమైన ఆంక్షలు విధించినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఆంక్షలు ఏమిటో ఒకసారి చూద్దాము.

    ఎట్టిపరిస్థితిలోనూ ఇక మీదట తెలంగాణ లో విడుదలయ్యే పెద్ద హీరోల సినిమాలకు బ్యానర్స్ కట్టేందుకు అనుమతి లేదట. అదే విధంగా థియేటర్లు వద్ద డీజే ని ఏర్పాటు చేసి, అభిమానులు సంబరాలు చేసుకోవడానికి కూడా ఒప్పుకోరట. జనాలు ఒకే చోట గుమ్మిగూడే విధంగా ఉండరాదని నిర్మాత దిల్ రాజుకి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి మరికాస్త వివరాలు రేపు బయటపడే అవకాశాలు ఉన్నాయి. రేపే ఈ చిత్రానికి సంబంధించిన జీవో ని విడుదల చేస్తారట. కేవలం ‘గేమ్ చేంజర్’ చిత్రానికే కాదు, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి కూడా టికెట్ రేట్స్ పెంచుతారట. మరోపక్క ‘డాకు మహారాజ్’ మూవీ నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘తమ సినిమాకి టికెట్ రేట్స్ అవసరం లేదు. ఉన్న రేట్స్ సరిపోతాయి’ అని అన్నాడట. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ‘గేమ్ చేంజర్’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ పొందాలంటే కచ్చితంగా 150 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావాలి.

    ప్రస్తుతం ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ని చూస్తుంటే అవలీల గా వస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవర్సీస్ లో ఈ చిత్రానికి మొదటి రోజు 3.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందులో కేవలం నార్త్ అమెరికా నుండే ఈ చిత్రానికి 1.5 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రానికి విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ వంద కోట్ల రూపాయలకు జరిగింది. ‘పుష్ప 2 ‘ కి అయితే వరల్డ్ వైడ్ గా 200 కోట్ల రూపాయిల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగింది. మరి ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ఏమేరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరగబోతుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే లిమిటెడ్ షోస్ ద్వారా ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 15 కోట్ల రూపాయిల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్టు తెలుస్తుంది.